Site icon NTV Telugu

OG : తెలంగాణలో టికెట్ రేట్లు తగ్గింపు?

Og

Og

అనేక చర్చలు, వివాదాలు, కోర్టు కేసుల అనంతరం ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం ఓజి సినిమాకి సంబంధించి పెంచిన రేట్లు తగ్గించి అమ్మాలంటూ ఒక మోస్ట్ అర్జెంట్ ఆర్డర్‌ని రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఓజి సినిమా రిలీజ్‌కి ముందు టికెట్ రేట్లు పెంచి అమ్ముకుంటామని ప్రభుత్వాన్ని అనుమతి కోరగా ప్రభుత్వం దానికి అనుమతించింది. ఈ మేరకు ఒక జీవో కూడా జారీ చేసింది. అయితే ఆ జీవోని సస్పెండ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అయినా సరే, చాలా చోట్ల పెంచిన రేట్లు అమ్మకాలు జరిగాయి. అయితే తాజాగా ఆ విషయంలో శ్రద్ధ తీసుకుని పెంచిన రేట్లు కాకుండా తెలంగాణలో అనుమతించిన రేట్లకే అమ్మకాలు జరపాలంటూ ప్రభుత్వం నుంచి ఒక ఆర్డర్ రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది.

Also Read :Traffic Challan : చెప్పులు వేసుకొని బైక్ నడిపితే జరిమానా..?

దీని ప్రకారం ఓ.జి. సినిమాకి మల్టీప్లెక్స్‌లకు 295 లకు సింగిల్ స్క్రీన్స్‌కి బాల్కనీ 175, లోయర్ క్లాస్ 110 రూపాయలకి అమ్మకాలు జరపాల్సి ఉంటుంది. నిజానికి ఓజి సినిమాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెంచుకుని అమ్ముకునేలా జీవో జారీ చేశారు. కాకపోతే అక్కడ ఎవరూ కోర్టుకు వెళ్లకపోవడంతో పెంచిన రేట్లు అమ్మకాలు జరిగాయి. కాకపోతే డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు స్వచ్ఛందంగా మినిమం రేటుకే అమ్మకాలు జరపడం మొదలుపెట్టారు. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఒక ఆర్డర్ రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓజి కలెక్షన్స్ మరింత ఊపొందుకునే అవకాశం ఉంది. కాకపోతే మరొక రెండు రోజుల్లో రెండు డబ్బింగ్ సినిమాలు కూడా థియేటర్లలోకి రాబోతున్నాయి. ఆ ఎఫెక్ట్‌తో ఈ కలెక్షన్స్ ఎంతవరకు రావచ్చు అనేది ప్రస్తుతానికి చెప్పలేని పరిస్థితి.

Exit mobile version