Site icon NTV Telugu

Breaking News : నేటి నుంచి షూటింగ్‌లు బంద్‌.. షూటింగ్‌లకు హాజరుకాని సినీ కార్మికులు

Telugu Film Industry

Telugu Film Industry

తెలుగు సినీ కార్మికులు వేతనాలు పెంచాలని కోరుతూ సమ్మె బాట పట్టారు. నేటి నుంచి షూటింగ్‌లకు హాజరు కాబోమని సినీ కార్మికులు ప్రకటించారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి 24 విభాగాల కార్మికుల వేతనాలను పెంచాల్సి ఉంటుంది. అయితే గత నాలుగున్నరేళ్లుగా నిర్మాతల మండలి ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నేటి నుంచి షూటింగ్‌లను బహిష్కరించి, ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సినీ కార్మికులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలుగు ఫిలిం ఫెడరేషన్ నేటి నుంచి షూటింగ్‌లకు బంద్ కు పిలుపు ఇచ్చింది. అయితే. షూటింగ్ లకు హాజరుకాని సిని కార్మికులు కృష్ణ నగర్ లో తమ యూనియన్ ఆఫీస్ లకు చేరుకుంటున్నారు. జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్లే బస్సులు ఇతర వాహనాలను ఫెడరేషన్ సభ్యులు నిలిపివేశారు. పది గంటల నుంచి తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర 24 క్రాఫ్ట్స్ కార్మికులు ఆందోళన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల మండలితో తెలుగు ఫిలిం ఛాంబర్ సభ్యులు సమావేశం కానున్నారు.

 

 

Exit mobile version