Site icon NTV Telugu

Teja Sajja: తేజ సజ్జా మరో అరుదైన ఫీట్

Teja Mirai

Teja Mirai

ఇటీవల మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజ మరో అరుదైన ఫీట్ అందుకున్నాడు. ఈ వారానికి గాను మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్టులో ఐఎండిపీకి గాను ఇండియా వైడ్ 9వ స్థానానికి ఎగబాకాడు. గత వారం తేజ 160వ స్థానంలో ఉన్నాడు కానీ ఈ వారం మిరాయ్ రిలీజ్ నేపథ్యంలో తేజ సజ్జా ఏకంగా తొమ్మిదో స్థానానికి రావడం గమనార్హం. ఇక ఈ లిస్టులో మొదటి ప్లేస్ లో సయారా హీరో అహన్ పాండే మూడో ప్లేస్ లో అనీత్ పడ్డ నిలిచారు. ఈ వారం నెట్ఫ్లిక్స్ లో సయారా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో వారు ఒక్కసారిగా తెరమీదకు వచ్చినట్లు అయింది.

Also Read :Gayathri Gupta: బయట వర్షం.. లోపల సెగలు.. సింగిల్ గా ఉన్నానంటూ నటి షాకింగ్ ఫొటోస్

ఇక మరో పక్క అక్షయ్ కుమార్ కి ఈ లిస్టులో ఆరవ స్థానం దక్కింది. జాలి ఎల్.ఎల్.బి 3 ప్రమోషన్స్ నేపథ్యంలో అక్షయ్ కుమార్ కి ఆ స్థానం దక్కింది. ఇక తేజ మిరాయ్ సినిమా విషయానికి వస్తే కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద విశ్వప్రసాద్ అత్యంత ప్రతిషాత్మకంగా నిర్మించారు. సుమారు 60 కోట్ల బడ్జెట్తో రూపొందించబడిన ఈ సినిమా తెలుగు సహా పాన్ ఇండియా భాషలతో పాటు చైనీస్, జపనీస్ వంటి భాషల్లో కూడా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా ఇప్పటికే వరల్డ్ వైడ్ 100 కోట్ల కలెక్షన్లు దాటి మరింత ముందుకు దూసుకు వెళ్తోంది.

Exit mobile version