‘హను-మాన్’ చిత్రంతో సరికొత్త చరిత్ర సృష్టించి, పాన్-ఇండియా స్థాయిలో సూపర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ స్టార్ తేజ సజ్జా (Teja Sajja) తన రాబోయే భారీ వీఎఫ్ఎక్స్ యాక్షన్ చిత్రాల విషయంలో ఎంతో తెలివిగా, పక్కా ప్లానింగ్‌తో అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ‘మిరాయ్’ (Mirai) పార్ట్ 1 విడుదలకు సిద్ధమవుతుండగా.. తేజ సజ్జా అప్పుడే ‘మిరాయ్ 2’ (Mirai 2) కోసం మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్‌లో ప్రీ-ప్లానింగ్ మొదలుపెట్టేశారు.
మనకు తెలిసి పెద్ద హీరోల పాన్-ఇండియా సినిమాలు విజువల్ ఎఫెక్ట్స్ పనుల ఆలస్యం కారణంగా నెలల తరబడి వాయిదా పడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే, తేజ సజ్జా మాత్రం అలాంటి తప్పు జరగకుండా చాలా స్మార్ట్‌గా ప్లాన్ చేస్తున్నారు. చిత్ర పరిశ్రమ ఇన్‌సైడ్ టాక్ ప్రకారం.. తేజ సజ్జా నేటి నుండి విశాఖపట్నం వేదికగా సైలెంట్‌గా ‘మిరాయ్ 2’ కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించారు. అయితే, ఇది సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కాదు. కేవలం సినిమాలోని అత్యంత కీలకమైన, భారీ వీఎఫ్ఎక్స్ బ్లాక్స్ కోసం అవసరమైన బ్లూ/గ్రీన్ మ్యాట్ షాట్స్, బ్యాక్‌గ్రౌండ్ ప్లేట్స్, గ్రాఫిక్స్ ప్రిపరేషన్ షాట్స్‌ను మాత్రమే ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. వైజాగ్‌లో దాదాపు పది రోజుల పాటు ఈ ప్రత్యేక షూట్ జరగనుంది. ఈ 10 రోజుల వీఎఫ్ఎక్స్ బ్లాక్స్ షూట్ ముగిసిన వెంటనే ఆ ఫుటేజ్‌ను గ్రాఫిక్స్ స్టూడియోలకు పంపించేస్తారట.
అంటే ఇప్పుడు కేవలం టాకీ పార్ట్, యాక్షన్ సీన్స్, సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటాయి. వాటిని చాలా వేగంగా పూర్తి చేసేయవచ్చు. దీనివల్ల షూటింగ్ పూర్తయ్యే సమయానికే గ్రాఫిక్స్ వర్క్ కూడా రెడీ అయిపోతుంది కాబట్టి.. విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యం కారణంగా సినిమా విడుదల వాయిదా పడే ఛాన్సే ఉండదు. మనం గమనిస్తే, ‘హను-మాన్’, ‘మిరాయ్’ చాలా తక్కువ బడ్జెట్‌లోనే విజయం సాధించి చూపించారు. ఇప్పుడు అదే ఫార్ములాను ‘మిరాయ్ 2’ కోసం మరింత అడ్వాన్స్‌డ్‌గా వాడుతున్నారు. దీంతో ఈ యంగ్ హీరో చూపిస్తున్న ప్రొఫెషనలిజం, స్మార్ట్ వర్కింగ్ స్టైల్ చూసి టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నాయి.
