Mirai 2: ‘మిరాయ్ 2’ వీఎఫ్ఎక్స్ కోసం… తేజ సజ్జా స్మార్ట్ ప్లానింగ్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘హను-మాన్’ చిత్రంతో సరికొత్త చరిత్ర సృష్టించి, పాన్-ఇండియా స్థాయిలో సూపర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ స్టార్ తేజ సజ్జా (Teja Sajja) తన రాబోయే భారీ వీఎఫ్ఎక్స్ యాక్షన్ చిత్రాల విషయంలో ఎంతో తెలివిగా, పక్కా ప్లానింగ్‌తో అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ‘మిరాయ్’ (Mirai) పార్ట్ 1 విడుదలయ్యి భారీ విజయం అందుకున్న తర్వాత.. ఇప్పుడు తేజ సజ్జా ‘మిరాయ్ 2’ (Mirai 2) కోసం మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్లో ప్రీ-ప్లానింగ్ మొదలుపెట్టేశారు.
మనకు తెలిసి పెద్ద హీరోల పాన్-ఇండియా సినిమాలు విజువల్ ఎఫెక్ట్స్ పనుల ఆలస్యం కారణంగా నెలల తరబడి వాయిదా పడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే, తేజ సజ్జా మాత్రం అలాంటి తప్పు జరగకుండా చాలా స్మార్ట్‌గా ప్లాన్ చేస్తున్నారు. చిత్ర పరిశ్రమ ఇన్సైడ్ టాక్ ప్రకారం.. తేజ సజ్జా నేటి నుండి విశాఖపట్నం వేదికగా సైలెంట్‌గా ‘మిరాయ్ 2’ కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించారు. అయితే, ఇది సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కాదు. కేవలం సినిమాలోని అత్యంత కీలకమైన, భారీ వీఎఫ్ఎక్స్ బ్లాక్స్ కోసం అవసరమైన బ్లూ/గ్రీన్ మ్యాట్ షాట్స్, బ్యాక్‌గ్రౌండ్ ప్లేట్స్, గ్రాఫిక్స్ ప్రిపరేషన్ షాట్స్‌ను మాత్రమే ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. వైజాగ్‌లో దాదాపు 10 రోజుల పాటు ఈ ప్రత్యేక షూట్ జరగనుంది. ఈ 10 రోజుల వీఎఫ్ఎక్స్ బ్లాక్స్ షూట్ ముగిసిన వెంటనే ఆ ఫుటేజ్‌ను గ్రాఫిక్స్ స్టూడియోలకు పంపించేస్తారట.
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
అంటే ఇప్పుడు కేవలం టాకీ పార్ట్, యాక్షన్ సీన్స్, సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటాయి. వాటిని చాలా వేగంగా పూర్తి చేసేయవచ్చు. దీనివల్ల షూటింగ్ పూర్తయ్యే సమయానికే గ్రాఫిక్స్ వర్క్ కూడా రెడీ అయిపోతుంది కాబట్టి.. విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యం కారణంగా సినిమా విడుదల వాయిదా పడే ఛాన్సే ఉండదు. మనం గమనిస్తే, ‘హను-మాన్’, ‘మిరాయ్’ చాలా తక్కువ బడ్జెట్లోనే విజయం సాధించి చూపించారు. ఇప్పుడు అదే ఫార్ములాను ‘మిరాయ్ 2’ కోసం మరింత అడ్వాన్స్డ్గా వాడుతున్నారు. దీంతో ఈ యంగ్ హీరో చూపిస్తున్న ప్రొఫెషనలిజం, స్మార్ట్ వర్కింగ్ స్టైల్ చూసి టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..