వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న తేజ సజ్జ, తాజాగా ‘మిరాయ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో, అన్ని భాషల మీడియా ప్రతినిధులకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అందులో భాగంగా, ఒక ఇంటర్వ్యూలో తేజ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తనకు ఒక పెద్ద డైరెక్టర్ కథ చెప్పాడని, కథ నచ్చడంతో షూట్‌కి కూడా వెళ్లామని చెప్పుకొచ్చాడు. 15 రోజులపాటు షూటింగ్ కూడా చేసి, తర్వాత బ్రేక్ ఇచ్చారని అన్నాడు.
Also Read : Bandla Ganesh: మౌళి… కొడితే నీలా కొట్టాలి రా బాబు దెబ్బ… చంపేశావ్!
అయితే, తన ప్లేస్‌లో ఆ సినిమాలో మరో హీరో నటిస్తున్నాడని తెలిసి ఆశ్చర్యపోయానని, ఆ తర్వాత తెలిసింది ఏంటంటే, తనను 15 రోజులు పాటు మాక్ షూటింగ్ కోసం మాత్రమే తీసుకున్నారని, అలా 15 రోజులపాటు తనను వాడుకున్నారని చెప్పుకొచ్చాడు. ఇక తేజ హీరోగా నటిస్తున్న ‘మిరాయ్’ సినిమాని, ‘ఈగల్’ సినిమాతో డైరెక్టర్‌గా మారిన సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా, సుమారు 60 కోట్లతో నిర్మించారు. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా రిలీజ్‌కి ముందే టేబుల్ ప్రాఫిట్స్ సంపాదించడం గమనార్హం. అయితే, తేజ చెప్పిన ఆ పెద్ద డైరెక్టర్ ఎవరు? ఏ సినిమా కోసం తేజాను మాక్ షూటింగ్ కోసం తీసుకున్నారు అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు.
