NTV Telugu Site icon

Pushpa 2: పుష్ప 2 రిలీజ్ ముందు ‘శిల్పా’ బ్యానర్ ఆటలు!

Sandhya

Sandhya

సరిగ్గా ఎన్నికల ముందు అప్పటి వైసిపి నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి నివాసానికి అల్లు అర్జున్ వెళ్లడం పెద్ద కలకలానికి దారితీసింది. ఎందుకంటే ఒకపక్క ఆయన చిన్న మామ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉండి వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే వైసీపీ అభ్యర్థికి ఎలా మద్దతిస్తారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ విషయం మీద అల్లు అర్జున్ కూడా శిల్పా రవిచంద్రా రెడ్డి తన స్నేహితుడు కాబట్టి వెళ్ళాను అంటూ పలుసార్లు క్లారిటీ ఇచ్చారు.

Pushpa 2 Bookings: ఇది సార్ పుష్ప గాడి బ్రాండు.. షేకయ్యేలా అడ్వాన్స్ బుకింగ్స్

ఇది అంతా జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం తర్వాత మెగా క్యాంప్ కి అల్లు క్యాంప్ కి మరింత దూరం పెరిగిందని ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమా రిలీజ్ కి ముందు హైదరాబాద్ సంధ్య థియేటర్లో టీం శిల్పా అంటూ శిల్పా రవిచంద్ర రెడ్డి తో అల్లు అర్జున్ ఫోటో దిగిన ఒక ఫోటోని బ్యానర్ గా ప్రచురించారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సాయంత్రానికల్లా ఆ బ్యానర్ ని తొలగించారు థియేటర్ యాజమాన్యం. ఎందుకు తొలగించారు అనే విషయం మీద క్లారిటీ లేదు ఎవరి నుంచి ఆదేశాలు రావడంతో తొలగించారు అనే విషయం మీద కూడా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.