NTV Telugu Site icon

NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన తారక్, కళ్యాణ్ రామ్..

Ntr ,kalyan Ram

Ntr ,kalyan Ram

NTR : విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నటుడిగా ఎన్నో గొప్ప చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సొంతంగా రాజకీయ పార్టీని మొదలు పెట్టి తిరుగులేని నాయకుడిగా ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిలో నిలిచిపోయారు. గత  ఏడాది ఎన్టీఆర్ శత జయంతిని ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఘనంగా నిర్వహించారు.

Read Also:SSMB 29: మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్‌లో బాలీవుడ్‌ నటుడు!

ఇదిలా ఉంటే నేడు మే 28 ఎన్టీఆర్ 101 వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కుటంబ సభ్యులు ,తెలుగు దేశం పార్టీ నాయుకులు కార్య కర్తలు మరియు అభిమానులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు.ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ నేడు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని తమ తాతయ్యకు నివాళులు అర్పించారు.నేడు ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ చేరుకోవడంతో అభిమానులు వారిని చూసేందుకు ఎగబడ్డారు.ప్రస్తుతం ఇందుకు సంబందించిన పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

Show comments