Site icon NTV Telugu

మోస్ట్ అవైటెడ్ సిరీస్ “నవరస” వచ్చేస్తోంది !

Tamil anthology Navarasa on August 6

సౌత్ లో రానురానూ ఓటిటి ప్లాట్‌ఫామ్‌ లు ఆదరణ పెరుగుతోంది. తాజాగా మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. తమిళ భాషలో రూపొందుతున్న అతిపెద్ద ఓటిటి ప్రాజెక్టు “నవరస” కోసం దిగ్గజ దర్శకులు మణిరత్నం, జయేంద్ర పంచపకేసన్ చేతులు కలిపారు. 9 భావోద్వేగాలను, 9 కథల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు.

Read Also : “మందులోడా” మాస్ సాంగ్ రిలీజ్ చేసిన మెగాస్టార్

ఆగస్టు 6 న నెట్‌ఫ్లిక్స్‌లో “నవరస” విడుదల కానుంది. ఇందులో కోలీవుడ్ కు చెందిన స్టార్స్ ప్రధాన పాత్రలు పోషించారు. అరవింద్ స్వామి, బెజోయ్ నంబియార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్, కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన ఈ 9 కథలలో నిత్యా మీనన్, పార్వతి, ఐశ్వర్య రాజేష్, సూర్య, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్ లాంటి దిగ్గజ నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ కోపం, కరుణ, ధైర్యం, అసహ్యం, భయం, నవ్వు, ప్రేమ, శాంతి, అద్భుతం టీజర్ 9 భావోద్వేగాలను ప్రదర్శిస్తుంది. ఈ భావోద్వేగ ప్రయాణానికి సంబంధించిన టీజర్ ను మీరు కూడా వీక్షించండి.

Exit mobile version