మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా షేర్ చేసిన తాజా పిక్స్ కు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తన అద్భుతమైన ఫ్యాషన్ అభిరుచితో నెటిజన్లను ఫిదా చేసేస్తోంది. మాస్టర్ చెఫ్ తెలుగు షూటింగ్‌లో బిజీగా ఉన్న ఈ స్టన్నింగ్ బ్యూటీ డాలీ జె రూపకల్పన చేసిన అద్భుతమైన డ్రెస్ లో మెరిసిపోయింది. జపనీస్ కట్-డానాతో హైలైట్ చేయబడిన ఐవరీ టల్లే సీక్విన్డ్ డ్రాప్డ్ గౌనులో తమన్నాను చూసిన నెటిజన్లు దేవకన్యలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. తమన్నా భాటియా ఓపెన్ సాఫ్ట్ కర్ల్స్, పింక్ ఐ-షాడో, రోజీ బుగ్గలు, నేచురల్ లిప్ కలర్ మేకప్ లో పర్ఫెక్ట్ లుక్ తో ఆకట్టుకుంటోంది.
Read Also : సరికొత్త బాడీ ట్రాన్సఫార్మేషన్ లుక్ లో రౌడీ హీరో…!
ఇక సౌత్ లో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ లలో తమన్నా ఒకరు. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ హిట్ మూవీ “అంధాదున్” రీమేక్ లో నటిస్తోంది. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో “మాస్ట్రో” టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో నితిన్ అంధుడిగా నటిస్తున్నాడు. మరోవైపు “ఎఫ్ 2” సీక్వెల్ అయిన “ఎఫ్ 3” షూటింగ్ లో పాల్గొంటోంది తమన్నా. అంతేకాకుండా సత్యదేవ్ తో “గుర్తుందా శీతాకాలం” అనే తెలుగు చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. దినేష్ విజన్ వెబ్ సిరీస్ “యారి దోస్తీ”లో కూడా కనిపించనుంది. ఈ వెబ్ సిరీస్ 2022లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రదర్శించబడుతుంది.
A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)