Site icon NTV Telugu

Tamannaah : అమ్మ నాన్న మాట వినకపోవడం మంచిదైంది..

Thamanna

Thamanna

హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి దాదాపు 20ఏండ్లు కావొస్తున్నా.. ఇప్పటికీ అంతే క్రేజీ హీరోయిన్‌గా చక్రం తిప్పుతోంది తమన్నా. ఆమె ఐటమ్‌ సాంగ్‌ చేస్తే సినిమాకే హైప్‌ వస్తుంది. ఆమె వెబ్‌ సిరీస్‌ చేసినా దానికి ఎక్కడ లేని బజ్‌ క్రియేట్‌ అవుతుంది. సినిమాల సంఖ్య తగ్గినా తమన్నా ఇమేజ్‌ ఇసుమంత కూడా తగ్గలేదు. ఇక ఎంత బీజీగా ఉన్నప్పటికి కూడా అభిమానులతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటారు తమన్నా. రీసెంట్‌గా నిర్వహించిన చిట్‌ చాట్‌లో ఆమె వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి.

Also Read: COVID 19: కోవిడ్ బారిన పడ్డ మరో సినీ నటి..

తమన్నా మాట్లాడుతూ.. ‘సినిమా ఇండస్ట్రీలోకి ఆడవారు రావడం అంటే ఇప్పటికి కూడా అది పెద్ద విషయం. నేరంగా భావించేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నాయి. నేను హీరోయిన్ అవ్వాలనుకుంటున్న విషయం ఇంట్లో చెబితే.. మా అమ్మానాన్నలకు సినిమా ఇండస్ట్రీ గురించి భయంకరంగా చెప్పారు. ఇక ఇరుగుపొరుగు వారికి తెలిసి నేను పెద్ద నేరం చేస్తున్నట్టుగా మాట్లాడటం మొదలు పెట్టారు. కానీ ఆ రోజు నా పేరెంట్స్‌ వాళ్ల మాటలు విన్నట్టయితే.. ఈ రోజు నటిగా నా కెరీర్‌ ఉండేది కాదు. వేధింపులు అన్ని రంగాల్లోనూ ఉంటాయి. అలాంటప్పుడు సినిమా ఇండస్ట్రీని మాత్రమే ఎందుకు భూతద్దంలో పెట్టి చూస్తారు?’ అంటూ తమన్నా ప్రశ్నించింది. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version