NTV Telugu Site icon

Keerthy Suresh: ఆగస్టు 15 సినిమాల రేస్ లో రఘు తాత..కీర్తి మెప్పిస్తుందా..?

Untitled Design (33)

Untitled Design (33)

నేను శైలజ చిత్రంతో తటాలీవుడ్ లో అడుగుపెట్టింది తమిళ నాయకి కీర్తి సురేష్, ఆ చిత్రం సూపర్ హిట్ తో టాలివుడ్ లో వరుస ఆఫర్లు వచ్చాయి. ఆలా మహానటి చిత్రంలో అవకాశం దక్కించుకుంది కీర్తి సురేష్. ‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ పాత్రలో కీర్తి తప్ప మరొకరు నటించలేరెమో అనేలా ఒదిగిపోయి ప్రేక్షకులతో కంటతడి పెట్టించింది కీర్తి. ఇటీవల టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గినా కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తమిళంలో రూపొందిన చిత్రం ‘రఘు తాత’. సుమన్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ‘రఘు తాత’ ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ‘మలుపులతో కూడిన వినోదాన్ని ఆస్వాదించేందుకు రెడీగా ఉండండి’ అంటూ కాప్షన్ ను జత చేశారు.

Also Read: Tollywood :సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు..

కయల్విజి పాత్రలో పక్కింటి అమ్మాయిలాగా సహజంగా నటిస్తూ నవ్వులు పూయిస్తూ సాగిన ట్రైలర్‌లో కీర్తి  నటన ఆకట్టుకుంది. హిందీ రాని ఓ తమిళ యువతీ ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొంది చివరికి వాటిని ఎలా అధిగమించింది అనే కథ నేపధ్యాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు సుమన్ కుమార్. ఈ చిత్రంలో రవీంద్ర విజయ్, ఎమ్మెస్‌ భాస్కర్‌ ఆనంద్‌ సామి, దేవదర్శిని కీలక పాత్రలలో నటించారు. ‘రఘు తాత’కు శ్యాన్‌ రోల్డన్‌ సంగీతం అందించారు. కన్నడలో భారీ బడ్జెట్ చిత్రాలు కేజీఎఫ్, కాంతారా వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలు నిర్మించిన హోంభలే ఫిలిమ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందుర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 15న భారీ బడ్జెట్ చిత్రాల మధ్య పోటీగా రిలీజ్ కానుంది ఈ చిత్రం.

 

Show comments