Happy Birthday Tabu: అభినయమే టబు ఆయుధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heroine Tabu: టబు తెలుగు చిత్రాలతోనే వెలుగు చూసిన తార. తెలుగునాట టాప్ హీరోస్ అందరితోనూ నటించి ఆకట్టుకున్న అభినేత్రి టబు. ఉత్తరాదిన సైతం నటిగా తానేమిటో చాటుకున్న అందాలతార. రెండు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలచిన టబు, తెలుగు చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికించారు.
టబు పూర్తి పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మి. 1971 నవంబర్ 4న హైదరాబాద్ లో టబు జన్మించారు. విజయనగర్ కాలనీలోని సెయింట్ యాన్స్ హైస్కూల్ లో పదో తరగతి చదివిన టబు, తరువాత ముంబయ్ చేరి, అక్కడ సెయింట్ జేవియర్స్ కాలేజ్ లో ప్లస్ టూ పూర్తి చేశారు. హైదరాబాద్ లో చదువుతూ ఉండగానే టబు, స్మితాపాటిల్ నటించిన ‘బజార్’లో బాలనటిగా నటించింది. అది కాగానే 1985లో దేవానంద్ తెరకెక్కించిన ‘హమ్ నవ్ జవాన్’లో టీనేజ్ గాళ్ గా నటించి మురిపించింది. అయితే టబు నాయికగా నటించిన తొలి చిత్రం కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా రూపొందిన ‘కూలీ నంబర్ 1’. అందులో ఆమె పేరు స్వాతి అని ప్రకటించారు. టబు అక్క ఫరా కూడా అంతకు ముందే హీరోయిన్ గా కొన్ని చిత్రాలలో నటించారు. ఆమె కూడా వెంకటేశ్ సరసన ‘విజేత్ విక్రమ్’లో నాయికగా కనిపించారు. తొలి సినిమా ‘కూలీ నంబర్ వన్’లోనే టబు తన అందాల ఆరబోతతో కుర్రకారును కిర్రెక్కించింది. మహానటి షబానా ఆజ్మీ కూడా టబుకు సమీపబంధువు.
Also Read
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్‌లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
- Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3' వస్తోంది!
- Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్‌ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
- Divija Prabhakar: ఎంతో కష్టపడి సినిమా చేశాం.. 'వెంకట్రామయ్య గారి తాలూకా' అందరికీ నచ్చుతుంది!
Read also: Kishan Reddy: సీబీఐ, సీఐడీ లను అడ్డుకునేందుకు పాత తేదీలతో జీవోలు
టబు ఉత్తరాదికి వెళ్ళి హిందీ చిత్రసీమలో తన అదృష్టం పరీక్షించుకున్నారు. ఆరంభంలో అక్కడ పలు పరాజయాలే ఆమెను పలకరించాయి. అజయ్ దేవగన్ సరసన నటించిన ‘విజయ్ పథ్’మంచి పేరు సంపాదించి పెట్టింది. నాగార్జున చిన్న కొడుకు అఖిల్ నటించిన తొలి చిత్రం ‘సిసింద్రీ’లో టబు ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించారు. ఆ తరువాత అదే నాగ్ సరసన నాయికగా ‘నిన్నే పెళ్ళాడతా’లో నటించారు టబు. ఆ సినిమా ఆమె కెరీర్ లోనే బిగ్ హిట్ అని చెప్పవచ్చు. అదే యేడాది గుల్జార్ తెరకెక్కించిన ‘మాచిస్’తో జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలిచారు టబు. తమిళంలో ఆమె నటించిన ‘కాదల్ దేశమ్’ తెలుగులో ‘ప్రేమదేశం’ పేరుతో అనువాదమై అనూహ్య విజయం సాధించింది. ‘చాందినీ బార్’తోనూ టబు మరోమారు ఉత్తమనటిగా నేషనల్ అవార్డు అందుకున్నారు.
టబు నటించిన “విరాసత్, బోర్డర్, చాచీ 420, హు తు తు, తక్షక్, చాందినీ బార్, మక్బూల్, చీనీ కుమ్, హైదర్, అంధాదున్”వంటి చిత్రాలు మంచి ఆదరణ చూరగొన్నాయి. ఇక తెలుగులో నాగార్జున సరసన ‘ఆవిడా మా ఆవిడే’లోనూ, బాలకృష్ణతో ‘చెన్నకేశవరెడ్డి, పాండురంగడు’ చిత్రాలలోనూ, చిరంజీవి జంటగా ‘అందరివాడు’లోనూ నటించి మెప్పించారు టబు. “షాక్, ఇదీ సంగతి” చిత్రాలలోనూ టబు కనిపించారు. ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో హీరోకు తల్లిగా నటించిన టబు, ఆ సినిమాలోనూ తనదైన బాణీ పలికించారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి మెప్పించడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం “దృశ్యం-2, కుత్తే, ఖుఫియా, భోలా” చిత్రాలలో నటిస్తున్నారు. త్వరలోనే ‘దృశ్యం-2’ జనం ముందుకు రానుంది. ఈ సినిమాలలో టబు అభినయం ఏ తీరున అలరిస్తుందో చూడాలి.
Kishan Reddy: మీ ఎమ్మెల్యేలను కొనే ఖర్మ మాకు లేదు
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్‌పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్‌లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్‌ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!