‘మిషన్ ఇంపాజిబుల్’లో తాప్సీ పన్ను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లోని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ఒకవైపు స్టార్ హీరోలతో హై బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూనే మరోవైపు చిన్న- మధ్య తరహా బడ్జెట్లతో మంచి కంటెంట్ ఆధారిత చిత్రాలను ప్రొడ్యూస్ చేస్తోంది. ప్రస్తుతం మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్ ఎస్ జె దర్శకత్వంలో ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ థీమ్ పోస్టర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ను మేకర్స్ అందించారు.
Read Also : కొత్త మూవీకి తేజ సజ్జ షాకింగ్ రెమ్యూనరేషన్…!!?
Also Read
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
- Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
- APFDC: సినిమా షూటింగ్స్‌కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్‌గా మార్చేందుకు కీలక నిర్ణయాలు
‘ఝుమ్మంది నాదం’ మూవీతో 2010లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన తాప్సీ పన్ను… ఇప్పుడు ఎక్కువగా హిందీ చిత్రాలపైనే ఫోకస్ పెట్టింది. తెలుగులో అడపా దడపా సినిమాలు చేస్తోంది. ‘ఆనందో బ్రహ్మ, నీవెవరో, గేమ్ ఓవర్’ వంటి సినిమాలలో ఆ మధ్య నటించింది. ఆ తర్వాత స్ట్రయిట్ తెలుగు సినిమాలో చేయలేదు. అయితే తాజాగా ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాలో లీడ్రోల్లో ఆమె నటిస్తోంది. మంగళవారం నుండి ఈ సినిమా షూటింగ్ లో ఆమె పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు యూనిట్ సభ్యులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అంతేకాదు… చేతికి కట్టుతో ల్యాప్‌టాప్‌లో ఏదో సీరియస్‌గా చూస్తున్న వర్కింగ్ స్టిల్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా తాప్సీ పన్ను మాట్లాడుతూ – గత 7 సంవత్సరాలుగా ఒక ప్రేక్షకుడిగా నన్ను తెరపై ఎలా చూడాలని అనుకుంటాడో అలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. దాని కోసం నేను నా సమయాన్ని, డబ్బును ఖర్చు చేశాను. 'మిషన్ ఇంపాజిబుల్' అలాంటి చిత్రాల్లో ఒకటి. ఆకట్టుకునే కథాంశంతో పాటు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ లాంటి మంచి టీమ్ లభించడం ఆనందంగా ఉంది. క్వాలిటీ చిత్రాలను ఎన్నుకోవడంలో ప్రేక్షకులు నాపై ఉంచిన నమ్మకాన్ని, ఇలాంటి సినిమాలలో భాగం కావడం ద్వారా నేను ఖచ్చితంగా నిలబెట్టుకోగలనని నమ్ముతున్నాను అని తాప్సీ తెలిపింది.
నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్. ఎం. పాష అసోసియేట్ ప్రొడ్యూసర్. దీపక్ యరగర సినిమాటోగ్రాఫర్, మార్క్ కె రాబిన్ సంగీత దర్శకుడు, రవితేజ గిరిజల ఎడిటర్ గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
తాజావార్తలు
-
Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!