NTV Telugu Site icon

T series : రాజసాబ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన భూషన్ కుమార్

T Series

T Series

ఈ ఏడాది కల్కి తో సూపర్ హిట్ అందున్నాడు రెబల్ స్టార్. అదే జోష్ లో మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. హార్రర్‌, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన డార్లింగ్ ప్రభాస్ లుక్ కు విశేష స్పందన లభించింది.

Also Read : Tollywood : సినిమా ‘లీక్స్’ జరుగుతున్నాయా.. కావాలనే చేస్తున్నారా..?

ఇదిలా ఉండగా రాజా సాబ్ ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ సంస్థ టీ సిరీస్ దాదాపు రూ. 25 కోట్లకు ఆడియో రైట్స్ కొనుగోలు చేసింది. కాగా ఈ సినిమాపై టీ సిరిస్ అధినేత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. భూషణ్ కుమార్ మాట్లాడుతూ ” మేము రాజాసాబ్ ఆడియో రైట్స్ తీసుకున్నాం. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని సీన్స్, సాంగ్స్ విజువల్స్ చూసాను. నాకు హాలీవుడ్ సూపర్ బ్లాక్ బస్టర్ హ్యారీ పోటర్ సినిమా  వైబ్ కనిపించింది. ఈ సినిమా ఖచ్చితంగా సెన్సేషనల్ హిట్ అవుతుంది’ అని  అన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  అత్యంత భారీ బడ్జెట్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తుండగా యస్ యస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని ఇది వరకే ప్రకటించారు మేకర్స్

Show comments