Suryakumar Yadav: శ్రేయస్ అయ్యర్‌కు గట్టి పోటీ.. టీమిండియా రీఎంట్రీకి సూరీడి మాస్టర్ ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav Fifty: టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో వార్తల్లో నిలిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026లో ముంబై కెప్టెన్‌గా బరిలోకి దిగిన సూర్య.. హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి తనలోని దూకుడు ఇంకా తగ్గలేదని నిరూపించాడు. ఈరోజు కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో సూర్య మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
హైదరాబాద్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబైకి ఓపెనర్లు అంగ్క్రిష్ రఘువంశీ, హార్దిక్ తమోర్ మంచి ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించారు. రఘువంశీ 13 బంతుల్లో 27 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం హార్దిక్ తమోర్, ముషీర్ ఖాన్ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. హార్దిక్ 16 బంతుల్లో 22 పరుగులు చేయగా.. ముషీర్ కేవలం 24 బంతుల్లో 51 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ముషీర్ ఔటైన తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే బౌండరీలతో హోరెత్తించాడు.
Also Read
- Rowdy Janardhana: విజయ్, సూర్య కాదు.. 'రౌడీ జనార్ధన'లో మలయాళ స్టార్!
- Vintara Saradaga Release Date: నూతన సంవత్సర కానుకగా గౌరీ ప్రియ ‘వింటారా సరదాగా’!
- Keerthy Suresh: వెరీ టఫ్ కాంపిటీషన్.. మరోసారి రిస్క్ చేస్తోన్న 'మహానటి'!
- Dhurandhar 2 vs Ramayan: 'ధురంధర్ 2' వర్సెస్ 'రామాయణ'.. రెండో శుక్రవారం కలెక్షన్లలో టాప్ మూవీ ఏదంటే?
సూర్యకుమార్ కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివరి వరకు నాటౌట్‌గా నిలిచిన సూర్య.. 21 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఇందులో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. 285.71 స్ట్రైక్‌రేట్‌తో సూరీడు చేసిన విధ్వంసంతో ముంబై సునాయాస విజయాన్ని అందుకుంది. శివమ్ దూబే ఐదు బంతుల్లో రెండు సిక్సర్లతో 13 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. అభిరథ్ రెడ్డి 24 బంతుల్లో 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోడిమెల హిమతేజ 16 బంతుల్లో 25 పరుగులు చేశాడు. కెప్టెన్ చామ మిలింద్ 12 బంతుల్లో 22 పరుగులు చేయగా.. ప్రణవ్ వర్మ 14 బంతుల్లో 18 పరుగులు సాధించాడు. ముంబై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో హైదరాబాద్ భారీ స్కోరు సాధించలేకపోయింది. మాక్స్వెల్ స్వామినాథన్ నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
సూర్యకుమార్ యాదవ్‌కు 2026 జూన్‌లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్ అందించిన కొద్ది నెలలకే అతడిని భారత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాటు జట్టులోనూ చోటు కోల్పోయాడు. అనంతరం ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలలో శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. దీంతో మళ్లీ టీమిండియాలోకి రావడమే లక్ష్యంగా సూర్య దేశవాళీ క్రికెట్‌పై దృష్టి పెట్టాడు. రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత 2024 జూలైలో సూర్య భారత జట్టు పగ్గాలు చేపట్టాడు. అతడి నాయకత్వంలో భారత్ 50 మ్యాచ్‌ల్లో 42 విజయాలు సాధించింది. ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లు, టోర్నీల్లో ఓటమి లేకుండా జట్టును నడిపించడంతో పాటు ఆసియా కప్ 2025, టీ20 ప్రపంచకప్ 2026 టైటిళ్లను అందించాడు. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్‌పై ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సూర్యకుమార్ తన ఫామ్‌ను చాటుకున్నాడు. 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించడం ద్వారా బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశాడు. ఇదే జోరును కొనసాగిస్తే.. టీమిండియాలోకి తిరిగి వచ్చే అవకాశాలు లేకపోలేదు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: శ్రేయస్ అయ్యర్‌కు గట్టి పోటీ.. టీమిండియా రీఎంట్రీకి సూరీడి మాస్టర్ ప్లాన్!
-
Panasonic ToughBook FZ-G3: Panasonic కొత్త రగ్డ్ టాబ్లెట్ ToughBook FZ-G3 లాంచ్.. 16GB RAM, 512GB SSD
-
IND vs PAK U19 Asia Cup Final: భారత్ ముందు భారీ టార్గెట్.. పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్!!
-
Vastu Tips: ఇంట్లో పొరపాటున కూడా ఈ 3 మొక్కలను పెంచకండి.. దరిద్రం వెంటాడుతుంది!!
-
Kadapa Controversy: రాజకీయ నేత కోసం వెంకన్న పోస్టరా? కడపలో వైరల్‌గా మారిన ఫొటో!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!