NTV Telugu Site icon

Surya : ఫ్లాప్ డైరెక్టర్ దర్శకత్వంలో సూర్య బాలీవుడ్ ఎంట్రీ..

Surya

Surya

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య విభిన్న కథలతో, తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచుకున్నారు. సూర్య సినిమాలకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి డిమాండ్ ఉంది. సూర్య నటించిన 7th సెన్స్, గజినీ, బ్రదర్స్, యముడు, సింగం సినిమాలు తెలుగులో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టాయి. ప్రస్తుతం శివ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రం ‘కంగువ’. 8 పాన్ ఇండియా భాషలలో రిలీజ్ కానుంది ఈ చిత్రం. ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ విశేషంగా ఆకట్టుంది. నవంబర్‌ 14న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read : N convention : నాగార్జున పై కేసు నమోదు

ఇదిలా ఉండగా సూర్య ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ తో తుఫాన్ అనే డిజాస్టర్ సినిమాను తెరకెక్కించిన సీనియర్‌ దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా సూర్యతో ఓ సినిమా చేస్తున్నట్టు కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. మహాభారతం ఇతివృత్తాతంలో అత్యంత భారీ బడ్జెట్ పై ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో సూర్య కర్ణుడిగా కనిపించనున్నారని, ‘కర్ణ’ అనే టైటిల్‌ కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో సూర్య తో పాటుగా బాలీవుడ్ యాక్టర్స్ కూడా అతిది పాత్రల్లో నటిస్తారని టాక్ వినిపిస్తుంది. సూర్య సరసన జాన్వీకపూర్‌ కథానాయికగా ఎంపిక చేశారట. ఈ వార్తలపై దర్శకూడూ రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా ఐఫా (IIFA Awards) వేదికగా మాట్లాడుతూ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వర్క్‌ జరుగుతుందని తెలిపారు. సూర్య బాలీవుడ్ ఎంట్రీతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

Show comments