Site icon NTV Telugu

Surya : ఆ విషయంలో ఇప్పటికి బాధపడుతున్న..

Surya

Surya

తమిళ స్టార్ హీరో సూర్య కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ఒక తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా సూర్య సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. చివరిగా ‘కంగువా’ చిత్రంతో రాగా కమర్షియల్‌గా ఫెయిల్ అయ్యింది. ఫ్యాన్స్, ఆడియెన్స్‌కు కూడా అంతగా ఆకట్టుకోలేకపొయింది. ఇక తాజాగా ‘రెట్రో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సూర్య. మే1న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. మొదటి షోల్లో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో సినిమా కలెక్షన్ల పై ఆసక్తి నెలకొంది. అయితే, సూర్య ‘రెట్రో’ కోసం మునుపెన్నడూ లేని విధంగా జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీయర్ లో ఒక రూల్ ను బ్రేక్ చేశానని చెప్పుకొచ్చారు..

Also Read : jackfruit seeds : పనస తొనలు తింటున్నారా.. అయితే జాగ్రత్త

‘నా సినీ కెరీర్ లో ఎప్పుడు కూడా సినిమాల ద్వారా స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్‌ను అదే పనిగా చూపించలేదు. సీన్ కోసం తప్పితే. కానీ ‘విక్రమ్’ సినిమాలోని రోలెక్స్ పాత్రతో అది బ్రేక్ చేశా . అది కూడా అనుకోకుండా జరిగిపోయింది. ఇప్పటికి బాధ పడుతున్నా. ఆ పాత్ర చాలా క్రూరమైన, చెడ్డ వాడికి సంబంధించిందనే విషయం మాత్రమే నాకు తెలుసు. కానీ షూటింగ్ కు వెళ్లిన తర్వాత స్క్రిప్ట్ ఇచ్చారు, కేవలం హాఫ్ డే షూటింగ్ మాత్రమే చేశాను. అంతలోనే విధ్వంసం చూపించారు. ఇక కమల్ హాసన్ మూవీ కనుక కాదు అనలేక నా నియమాన్ని బ్రేక్ చేశా. ఇక ‘రెట్రో’ చిత్రంలోనూ స్మోకింగ్ చేస్తూ కనిపిస్తాను. ఎవరూ ఇలాంటి వ్యసనాలకు అలవాటు కావొద్దని ముందుగానే సూచించారు.’ అంటూ చెప్పుకొచ్చాడు.

Exit mobile version