Kanguva: ‘కంగువ’ డబ్బింగ్ స్టార్ట్ చేసిన హీరో సూర్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కంగువ’. పీరియాడిక్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాను యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నారు.సూర్య 42 వ మూవీ గా వస్తున్న కంగువ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో మరియు పోస్టర్లు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న కంగువ మూవీ 2024 వేసవి లో థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుందంటూ ఇప్పటి వరకు వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ ‘కంగువ’ను రూపొందిస్తున్నారు.
Also Read; Ranchi Test: భారత్, ఇంగ్లండ్ నాలుగో టెస్ట్.. ఖలిస్థానీ ఉగ్రవాది బెదిరింపులు!
Also Read
దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోన్న ‘కంగువ’లో బాబీ డియోల్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. తాజాగా ‘కంగువ’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ చేశారు హీరో సూర్య. డబ్బింగ్ వర్క్స్ జరుగుతున్న అద్నాన్ ఆర్ట్స్ స్టూడియోస్ లో హీరో సూర్యతో డైరెక్టర్ శివ, ఇతర టెక్నీషియన్స్ ఫొటో తీసుకున్నారు.పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో తెరకెక్కుతున్న ‘కంగువ’లో వరల్డ్ క్లాస్ మేకింగ్, సూర్య పర్ ఫార్మెన్స్ హైలైట్ కానుంది. హీరో సూర్య కెరీర్ లో హై బడ్జెట్ మూవీగా రూపొందుతున్న ‘కంగువ’ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఒక స్పెషల్ ఫిల్మ్ కాబోతోంది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించనున్నారు. త్రీడీలోనూ ‘కంగువ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు – సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!