NTV Telugu Site icon

Surya : ‘కంగువ’ ఆడియో రీలీజ్ కు ముఖ్య అతిధిగా స్టార్ హీరో..?

Kanguva

Kanguva

తమిళ స్టార్‌ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్‌ యాక్షన్‌ ఫిలింగా రానున్న ఈ సినిమాకు శివ దర్శకుడు.  బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్‌ నటుడు బాబీ డియోల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా దసరా కానుక అక్టోబర్‌ 10న రిలీజ్ కావాల్సి ఉండగా ‘వేట్టయాన్’ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది.

Also Read : Unstoppable 4 : కేవలం అల్లు అరవింద్‌ కోసమే ఒప్పుకొన్నా : బాలకృష్ణ

దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు స్టూడియో గ్రీన్ అధినేత కే.ఈ జ్ఞానవేల్ రాజా. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హై బడ్జెట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. కాగా ఈ సినిమాను నవంబరు 14న వరల్డ్ వైడ్ గ రిలీజ్  చేస్తామని ఇటీవల ప్రకటించారు మేకర్స్. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసాడు నిర్మాత జ్ఞానవేల్ రాజా. అందులో భాగంగా ఈ చిత్ర ఆడియో వేడుకను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాబోతున్నట్టు తమిళ వర్గాల సమాచారం. రజనీ నటించిన సినిమా కోసం అప్పటికి విడుదలకు రెడీ గా ఉన్న కంగువను పోస్ట్ పోను చేసుకున్నారు. ఆ కారణంగా రజనీ హాజరయి తనవంతుగా ప్రమోట్ చేయనున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే కంగువ కు భారీ పబ్లిసిటీ వచ్చినట్టే. మొత్తం 8 భాషల్లో రానున్న కంగువకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Show comments