NTV Telugu Site icon

Surya : అన్ స్టాపబుల్ సెట్లో కంగువ..

Unstp

Unstp

అన్‌స్టాపబుల్ టాక్‌షో సీజన్ – 4 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిధిగా విచ్చేసారు. బావ బావమరుదులు కలిసి అన్‌స్టాపబుల్ స్టేజ్ పై ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ నెల 25న మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు తీసుకు వస్తోంది ఆహా. ఇక అన్‌స్టాపబుల్ సీజన్ – 4 మిగిలిన ఎపిసోడ్స్ ను కూడా షూటింగ్ చక చక చేస్తోంది యునిట్. అందుకోసం స్టార్ హీరోలను ఈ వేదికపైకి తీసుకురానున్నారు.

Also Read : kanguva : సూపర్ స్టార్ అంటే ఆయన మాత్రమే..

తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ – 4 లో మలయాళ నాటుడు దుల్కర్ సల్మాన్ ఎపిసోడ్ ను షూట్ కంప్లిట్ చేసారు మేకర్స్. అలాగే ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్ ఎపిసోడ్ కూడా ముగించారు. ఇదిలా ఉండగా తమిళ స్టార్ హీరో సూర్య ఈ అన్‌స్టాపబుల్’ టాక్‌షో సీజన్ – 4 లో పాల్గొనబోతున్నారు. కంగువ ప్రమోషన్స్ లో భాగంగా సూర్య  ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. అన్‌స్టాపబుల్ షో లో సందడి చేసేందుకు సూర్య ఈ ఉదయం అన్నపూర్ణ స్టూడియోకు చేరుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో రిలీజ్ చేసారు. సూర్యతో పాటుగా ఆయన నటించిన పాన్ ఇండియా సినిమా కంగువ దర్శకుడు శివ పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ ఓ రేంజ్ లో ప్లాన్ చేసినట్టు సమాచారం. సూర్య సినీ జర్నీ విశేషాలతో పాటు సూర్య జ్యోతిక ప్రేమ విషయాలను బాలయ్యతో పంచుకోనున్నాడు సూర్య. అలాగే కంగువ తెలుగు ప్రమోషన్స్ ను అన్‌స్టాపబుల్ వేదికపై నుండి మొదలెట్టనున్నాడు సూర్య .