కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కరుప్పు’. ఈ చిత్రం కోసం సూర్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదల తేదీ గురించి సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సూర్య అఫీషియల్ ఫ్యాన్స్ క్లబ్ ఈ చిత్రం విడుదలపై వస్తున్న వార్తలపై ఓ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ.. సినిమా విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొంది.
ప్రస్తుతం కరుప్పు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చిత్ర యూనిట్ శ్రమిస్తోందని సూర్య అఫీషియల్ ఫ్యాన్స్ క్లబ్ చెప్పుకొచ్చింది. గతంలో వచ్చిన పుకార్లను నమ్మవద్దని, కేవలం అధికారిక హ్యాండిల్స్ ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ఈ స్పష్టతతో సూర్య అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. ‘#Karuppu’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఈ అప్‌డేట్‌ను నెట్టింట వైరల్ చేస్తున్నారు.
Also Read: Sai Pallavi: వన్ లవ్, వన్ ఛాన్స్.. సాయి పల్లవి కొత్త సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది!
త్వరలోనే కరుప్పు టీజర్ లేదా ట్రైలర్ విడుదల తేదీని కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి ‘కరుపు’ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అవ్వడంతో.. బాక్సాఫీస్ వద్ద సూర్య మరోసారి తన సత్తా చాటడం ఖాయంగా ఉంది. సూర్య కెరీర్‌లో ఇదొక విభిన్నమైన, మాస్ ఎంటర్టైనర్‌గా నిలుస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన త్రిష నటిస్తుండగా.. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు.
