Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!

Viswanath & Sons

Viswanath & Sons

Viswanath & Sons : బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టడమే కాదు.. ఓటీటీలోకి అడుగుపెట్టినా తన హవా ఏమాత్రం తగ్గదని కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరోసారి నిరూపించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య, మమితా బైజు జంటగా నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై దుమ్మురేపుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలైన క్షణం నుంచే ఈ చిత్రం సరికొత్త వ్యూవర్‌షిప్ రికార్డులను తిరగరాస్తోంది. థియేటర్లలో సంచలన విజయం సాధించిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన ఈ చిత్రం.. ప్రస్తుతం ఇండియా ట్రెండింగ్ చార్ట్స్‌లో ఏకంగా నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. అంతటితో ఆగకుండా, అంతర్జాతీయ స్థాయిలోనూ హాలీవుడ్ కంటెంట్‌ను తలదన్ని గ్లోబల్ టాప్-3 ట్రెండింగ్‌లో నిలిచి ఇండియన్ సినిమా సత్తాను చాటిచెప్పింది. దేశ విదేశాల ప్రేక్షకులు ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాకు ఫిదా అవుతున్నారు.

‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రంలోని మార్క్ ఎమోషన్స్ కీ హైలెట్‌గా నిలిచాయి. సంజయ్ విశ్వనాథ్ పాత్రలో సూర్య యాక్టింగ్, మమితా బైజు నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో జీవించగా.. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ప్రేక్షకులను కట్టిపడేసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మించిన ఈ చిత్రం.. థియేటర్లలోనే కాకుండా డిజిటల్ వేదికపై సైతం అన్‌స్టాపబుల్ రన్‌ను కొనసాగిస్తోంది.

విశ్వనాథ్ అండ్ సన్స్ కథ:
సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఒక బిజీ బిజినెస్‌మ్యాన్. ఒలింపిక్స్‌లో మెడల్ సాధించి తల్లి (రాధిక) కోరిక తీర్చిన అతను, ఆమె కోరిన మరో కోరికను మాత్రం తీర్చలేకపోతూ ఉంటాడు. అదే సంజయ్ పెళ్లి. చిన్నప్పుడు కొన్ని కారణాలతో పెళ్లే చేసుకోవద్దని ఫిక్సయిన సంజయ్, తల్లి ఎంత కోరుకున్నా, ఎంత బ్రతిమిలాడినా పెళ్లి జోలికి మాత్రం వెళ్ళడు. అయితే ఆమె తమ వంశం ఇక్కడితో ఆగిపోతుందని బాధపడుతుందనే విషయం తెలుసుకుని సరోగసి ద్వారా ఒక బిడ్డను కంటాడు. అయితే ఆ బిడ్డకు అరుదైన ఒక బోన్ మ్యారో డిసీజ్ రావడంతో, బోన్ మ్యారో డోనర్ కచ్చితంగా తల్లి కావాల్సి వస్తుందని తెలుసుకొని ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. అలా అక్కడ అతనికి మ్యాడీ (మమితా బైజు) పరిచయమవుతుంది. ఆమెను తీసుకుని ఇండియా తిరిగి వచ్చాక ఏం జరిగింది? సంజయ్ జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఎలాంటివి? అసలు ఈ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథ ఏంటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని చూడాల్సిందే.