Viswanadh & Sons : ఈ వారమే OTTలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఎక్కడ చూడాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెండితెరపై విలక్షణమైన పాత్రలతో అలరించే స్టార్ హీరో సూర్య, సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో రూపొందిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్ & సన్స్’. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటిస్తూ ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 11 నుంచి తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. పోస్టర్లో సూర్య స్టైలిష్ ఫాదర్ పాత్రలో కనిపించి మెప్పిస్తున్నారు. కళ్ళజోడు పెట్టుకుని, చంటిపిల్లాడిని బేబీ క్యారియర్‌లో ఎత్తుకుని, చేతిలో పాలసీసాతో చిరునవ్వులు చిందిస్తున్న లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. కుటుంబ విలువల నేపథ్యంలో సాగే ఈ కథలో వెంకీ అట్లూరి మార్కు భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. థియేటర్లలో మిస్సయిన ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మళ్ళీ చూడాలనుకునే సినీ ప్రియులు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు.
Also Read
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
తాజావార్తలు
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?