Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suriya: స్టార్ హీరో సూర్య, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒకే వేదికపై కలిస్తే ఆ సందడే వేరు. ఇటీవల జరిగిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ చిత్ర వేడుకలో సూర్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ చిత్రానికి జక్కన్న సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన స్టార్ హీరో సూర్య రాజమౌళిని ఉద్దేశించి క్రేజీ కామెంట్స్ చేశారు. “రాజమౌళి గారూ, దర్శకుడిగా ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు మీకు అభినందనలు. అయితే ఒక్క విషయం.. మిమ్మల్ని ‘సర్’ అని గౌరవంగా పిలుస్తున్నాను కానీ, ఇండస్ట్రీ అనుభవంలో మీకంటే నేనే సీనియర్ని! నాకు పరిశ్రమలో దాదాపు 28 నుంచి 29 ఏళ్లు పూర్తయ్యాయి” అంటూ సరదాగా పంచ్ విసిరారు. దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణంతో పాటు రాజమౌళి కూడా నవ్వుల్లో మునిగిపోయారు.
అంతటితో ఆగకుండా “కల్కి సినిమాలో మీరు ఓ రెండు నిమిషాల క్యామియో చేసినట్లు.. ఏదో ఒక రోజు మీ సినిమాలో నాకు కూడా ఓ చిన్న అతిథి పాత్ర ఇస్తారేమోనని చూస్తున్నా” అంటూ చమత్కరించారు. అనంతరం రాజమౌళి విజన్ గురించి సూర్య ఎంతో భావోద్వేగంగా కొనియాడారు. భారతీయ సినిమాను ప్రాంతీయ సరిహద్దులు దాటించి గ్లోబల్ మ్యాప్‌లో నిలబెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని ప్రశంసించారు. ఒక ఈగతోనైనా, అగ్ర హీరోలతోనైనా.. ప్రేక్షకుడు థియేటర్లో రెండున్నర గంటల పాటు కళ్లప్పగించి చూసేలా చేయగల కథా సంకల్పం ఆయన సొంతమని పేర్కొన్నారు. కొత్త తరాన్ని, వినూత్న ప్రయత్నాలను ప్రోత్సహించడంలో రాజమౌళి ఎప్పుడూ ముందుంటారని సూర్య కొనియాడారు. సరదా కౌంటర్లు, హృదయాన్ని హత్తుకునే ప్రశంసలతో సాగిన సూర్య స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
#Suriya:
"Congratulations #SSRajamouli garu for completing 25 yrs in the film industry as director. I'm saying him as 'sir' but I'm senior to him😀. Thanks for supporting youngsters with #DontTroubleTheTrouble. Salute for putting indian Cinema into the Global map. Your conviction… pic.twitter.com/xWKYHIxceE— AmuthaBharathi (@CinemaWithAB) September 27, 2026
తాజావార్తలు
-
Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో…
-
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలు జారిపడిపోయిన హిట్ మ్యాన్..
-
Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
-
TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
-
Telangana DEO : తెలంగాణలో 4 జిల్లాలకు కొత్త డీఈఓలు.. ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగింత
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!