Suriya : ఆగస్టు 14న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ‘లక్కీ భాస్కర్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో దీనిపై టాలీవుడ్, కోలీవుడ్‌లలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ లాక్ చేశారు.
ఈ ఆగస్టు 14 శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం లాంగ్ వీకెండ్ కావడంతో మేకర్స్ ఈడేట్ ను లాక్ చేసారు. ఇటీవల కరుప్పు సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అనుకున్న సూర్య అదే జోష్ లో విశ్వనాధం అండ్ షన్స్ ను రిలీజ్ చేసి హిట్ కొట్టాలని చుస్తున్నాడు. ఈ నేపథ్యంలో సాలిడ్ రిలీజ్ డేట్ లాక్ చేసారు మేకర్స్. ఈ సినిమాలో సూర్య సరసన యంగ్ సెన్సేషన్ మమితా బైజు హీరోయిన్గా నటిస్తుండగా సీనియర్ హీరోయిన్స్ రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఎంతో గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. తమిళ సెన్సేషన్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. అటు క్లాస్, ఇటు మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేలా ఉన్న ఈ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!
Also Read
- Yash Toxic Trailer: యశ్ అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘టాక్సిక్’ ట్రైలర్ వచ్చేది అప్పుడే!
- Awaraapan 2: ఇమ్రాన్ హష్మీకి అగ్ని పరీక్ష.. 'బట్వారా 1947' క్లాష్‌తో సీక్వెల్‌కు టెన్షన్?
- Operation Sindoor: 88 గంటల సీక్రెట్ మిషన్.. 'ఆపరేషన్ సింధూర్'పై డాక్యుమెంటరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
- Jr NTR : 'డ్రాగన్' షూటింగ్‌కు బ్రేక్.. ఎన్టీఆర్ గాయం కారణంగా శ్రీలంక షెడ్యూల్ రద్దు
తాజావార్తలు
-
IBPS Clerk Recruitment 2026: 11,403 క్లర్క్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. అర్హత, ఫీజు, పూర్తి వివరాలు
-
Asmita Dey: తండ్రి చనిపోయి 7 నెలలు… కూతురు తెచ్చిన గోల్డ్ దేశాన్నే కదిలించింది!
-
Yash Toxic Trailer: యశ్ అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘టాక్సిక్’ ట్రైలర్ వచ్చేది అప్పుడే!
-
Jemimah: “సైనికుల త్యాగాలను మరిచావా?”.. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమాను కౌగిలించుకున్న జెమిమా.. ట్రోల్స్ వర్షం!
-
Awaraapan 2: ఇమ్రాన్ హష్మీకి అగ్ని పరీక్ష.. ‘బట్వారా 1947’ క్లాష్‌తో సీక్వెల్‌కు టెన్షన్?
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!