NTV Telugu Site icon

suriya : తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ‘కంగువా’ రిలీజ్..

Kanguva

Kanguva

తమిళ స్టార్‌ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్‌ యాక్షన్‌ ఫిలింగా రానున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్‌ నటుడు బాబీ డియోల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నవంబరు 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది.

Also Read : Allu Arjun : పుష్పాతో పోటి.. భయపడుతున్న బడా సినిమా

ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా ప్రమోషన్స్ లో టీమ్ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా తెలుగు రాష్ట్రాల ప్రమోషన్స్ ను ముగించాడు నటుడు సూర్య. కాగా ఈ సినిమా తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఒక తెలుగు  స్టార్ హీరో సినిమాకు ఏ రేంజ్ లో విడుదల దక్కుతుందో ఆ స్థాయిలో విడుదల కానుంది కంగువ. ఇప్పటికి రెండు తెలుగు స్టేట్స్ లోని మెయిన్ సెంటర్స్ లోని ప్రముఖ థియేటర్స్ ను కంగువ కోసం లాక్ చేసి ఉంచారు. సూర్య కెరీర్ లో అత్యంత భారీ స్థాయిలో, హయ్యెస్ట్ బడ్జెట్ లో రానున్న సినిమా కావడం, లాంగ్ గ్యాప్ తర్వాత సూర్య సినిమా రిలీజ్ అవుతుండడంతో ఈ సినిమాకు ఇంతటి హడావిడి జరుగుతోంది. మరోవైపు తెల్లవారుజామున 4:00 గంటల ప్రీమియర్స్ తో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల దీపావళి సినిమాల హడావిడిగా కాస్త తగ్గడంతో అన్ని థియేటర్స్ లోను కంగువ రిలీజ్ కు భారీ ఏర్పాట్లు చేసారు.

Show comments