Site icon NTV Telugu

Surya 46 : ‘సూర్య 46’ గ్రాండ్ షూటింగ్ స్టార్ట్ – కొత్త పోస్టర్ వైరల్ !

Suriya 46 Shooting Begins ,

Suriya 46 Shooting Begins ,

ప్రజంట్ టాలీవుడ్ స్టార్ హీరో సూర్య కి బ్యాడ్ టైం నడుస్తోందని చెప్పాలి. వరుస ఫ్లాప్ లతో సతమవుతున్న సూర్య రీసెంట్ గా ‘రెట్రో’ తో మళ్లీ పరాజయం పాలయ్యాడు. ఈ మూవీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. ఇక తాజాగా సూర్య త‌న త‌దుప‌రి చిత్రం వెంకీ అట్లూరితో చేస్తున్న విష‌యం తెలిసిందే. తెలుగు తమిళ్ లో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రానికి తాత్కాలికంగా ‘సూర్య 46’ అనే టైటిల్‌తో పిలుస్తున్నారు.

Also Read : Kubera: ‘కుబేర’ నుండి పిపిపి.. డుండుండుం.. సాంగ్ రిలీజ్

ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించగా.. రీసెంట్ గా ప‌ళ‌ని మురుగ‌న్‌ని ద‌ర్శించుకున్న ఈ చిత్రబృందం, తాజాగా ఈ షూటింగ్‌ని ప్రారంభించింది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్టర్ పంచుకుంది మూవీ టీం. ఇందులో సూర్య బ్యాక్ లుక్ లో కనిపించాడు.. ‘The Celebration Begins’ అని రాసుకొచ్చారు. ఇక ఈ చిత్రంలో సూర్య సరసన మమితా బైజు కథానాయికగా నటిస్తున్నారు. అంతేకాకుండా, రవీనా టాండన్ మరియు రాధిక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version