Site icon NTV Telugu

“సూర్య40” ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్… ఎప్పుడంటే?

Surya

Surya

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆ జాబితాలో ఓ వెబ్ సిరీస్ కూడా ఉంది. అదే “నవరస”. ఈ వెబ్ సిరీస్ కు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ వెబ్ సిరీస్ తో పాటు సూర్య… వెట్రి మారన్ “వాడివాసల్”, దర్శకుడు పాండిరాజ్ తో ఓ చిత్రం చేయనున్నారు. దీనిని తాత్కాలికంగా “సూర్య40” అని పిలుస్తున్నారు. శివకార్తికేయన్ “డాక్టర్‌”తో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ ఈ చిత్రంలో కథానాయికగా కనిపించనుంది. తాజాగా ఈ చిత్రం నుంచి అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్.

Read Also : “రాధే శ్యామ్” ఫైనల్ షెడ్యూల్ ఎప్పుడంటే ?

జూలైలో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నాము అంటూ సూర్య అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. జూలై 22 సాయంత్రం 6 గంటలకు “సూర్య40” నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ కానుందని అధికారిక ప్రకటన వచ్చేసింది. ఒక మాస్ షార్ట్ వీడియోతో ఈ విషయాన్ని వెల్లడించారు మేకర్స్. దీంతో సూర్య అభిమానుల ఎదురు చూపులు ఇప్పటి నుంచే మొదలైపోయాయి. ఇక సూర్యకు తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా టాలీవుడ్ లో కూడా అభిమానులు ఉన్నారు. ఆయనకు ఇక్కడ మంచి మార్కెట్ ఉండడంతో సూర్య సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతుంటాయి.

https://twitter.com/sunpictures/status/1416993378793758721
Exit mobile version