“రాధే శ్యామ్” ఫైనల్ షెడ్యూల్ ఎప్పుడంటే ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్”. రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా ఇంకా చిత్రీకరణ దశలో ఉంది. యూవీ క్రియేషన్స్, టి-సిరీస్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్లు ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గిన వెంటనే షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు మేకర్స్. ప్రభాస్, పూజాహెగ్డే జూన్ లో షూటింగ్ లో పాల్గొన్నారు. దాంతో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో ఈ మూవీ టాకీ భాగాన్ని పూర్తి చేశారు. తాజా సమాచారం ప్రకారం జూలై 22న హైదరాబాద్‌లోని “రాధే శ్యామ్” సెట్స్‌కు హీరోహీరోయిన్లు తిరిగి రానున్నారు.

Read Also : ఇద్దరు భామలతో “రామారావు” రొమాన్స్

ఆ ఫైనల్ షెడ్యూల్ లో యూనిట్ ప్రధాన నటీనటులపై పెండింగ్‌లో ఉన్న ఓ పాటను చిత్రీకరించనుంది. ఈ నెల చివరి నాటికి మొత్తం షూటింగ్ ఫార్మాలిటీలు పూర్తవుతాయి. షూటింగ్ పూర్తవ్వగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కానున్నాయి. తుది షెడ్యూల్ ముగిసిన తర్వాత “రాధే శ్యామ్” నిర్మాతలు చిత్రం విడుదల తేదీని ప్రకటించాలని భావిస్తున్నారు. ఎంతోకాలం నుంచి ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకోనుందన్నమాట. ఇక ఈ చిత్రం పూర్తవ్వగానే ప్రభాస్ “ఆదిపురుష్”తో బిజీ కానున్నారు. పూజాహెగ్డే తమిళంలో తలపతి విజయ్ సరసన “బీస్ట్”లో నటిస్తున్న విషయం తెలిసిందే.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-