NTV Telugu Site icon

Teja Sajja: తేజ సజ్జా మిరాయ్ పుట్టినరోజు స్పెషల్ పోస్టర్ విడుదల

Untitled Design (28)

Untitled Design (28)

హనుమాన్ సినిమా సూపర్ హిట్ తో దూసుకుపోతున్న సూపర్ హీరో తేజ సజ్జా తదుపరి పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్‌’.  కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన యాక్షన్-అడ్వెంచర్‌లో సూపర్ యోధ పాత్రలో తేజా సజ్జా కనిపించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. తేజ సజ్జ పుట్టినరోజు సందర్భంగా, తేజ సజ్జ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు మేకర్స్.

Also Read: Akash: పెళ్ళి పీటలు ఎక్కబోతున్న మరో హీరోయిన్.. ఎవరంటే..?

తేజా సజ్జా పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో తేజ సజ్జా మండుతున్న ఇనుప రాడ్‌ను పట్టుకుని తనను తాను పడిపోకుండా కాపాడుకోవడం, వస్తువులు పైనుండి పడటాన్ని చూపిస్తూ, ప్రమాదకర పరిస్థితిలో చిక్కుకుపోయినప్పటికీ దైర్యంగా పోరాడుతున్న హీరోఇజాన్ని చూపించాడ. వెనుక ఒక పురాతన దేవాలయాన్ని కూడా చూపించాడు దర్శకుడు. ఈ పోస్టర్ లో చూపించిన యాక్షన్ ఘట్టాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. అత్యున్నత స్థాయి నిర్మాణ ప్రమాణాలతో ఎక్కడ కాంప్రమైస్ కాకుండా భారీ బడ్జెట్ లో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమా సాంకేతికంగా ఉన్నతంగా తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రం నుండి గతంలో రిలీజ్ చేసిన తేజ సజ్జ మరియు మంచు మనోజ్ పాత్రలను పరిచయం చేసే ఫస్ట్-లుక్ పోస్టర్లు మరియు గ్లింప్‌లు అద్భుతమైన స్పందననురాబట్టడమే కాకుండా ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. ఈ కొత్త పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. మిరాయ్‌ని 8 భాషల్లో ఏప్రిల్ 18, 2025న వేసవిలో 2డి మరియు 3డి వెర్షన్‌లలో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

Show comments