Site icon NTV Telugu

Jaat : జాట్’కి సెన్సార్ కట్లు.. ఏకంగా 22 సీన్లు?

Jaat

Jaat

సన్నీ డియోల్ హీరోగా నటించిన “జాట్” సినిమా రేపు బాలీవుడ్‌లో రిలీజ్ కాబోతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. మరికొద్ది సేపట్లో ముంబైలో ప్రీమియర్స్ ప్రదర్శించబోతుండగా, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ బోర్డు ఏకంగా 22 సీన్స్ మార్చమని కోరినట్లు వెల్లడైంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సుమారు 22 సీన్లు మార్చమని కోరడంతో సినిమా యూనిట్ అందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

Nithya Menon: నిత్యా టాలీవుడ్‌ను మర్చిపోయిందా..?

కొన్ని బూతు మాటలు, అసభ్యకరమైన మాటలను పూర్తిగా తొలగించాలని సూచించినట్లు తెలుస్తోంది. కొన్ని వాడుకలో ఉన్న హిందీ తిట్లను మాత్రం అనుమతించినట్లు సమాచారం. అలాగే, నేషనల్ వైడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్న “భారత్” లాంటి పదాన్ని వాడకూడదని, “సెంట్రల్” అనే పదాన్ని వాడకూడదని సూచించినట్లు తెలుస్తోంది. వాటి బదులు “హమారా” అలాగే “లోకల్” అని వాడమని సెన్సార్ బోర్డు సూచనలు చేసింది. అలాగే, ఆడవారిపై లైంగిక దాడి జరుగుతున్న సీన్స్ విషయంలో కూడా మార్పులు, చేర్పులు జరిగాయి. గ్రాఫిక్స్‌లో చేసిన కొన్ని సీన్స్ విషయంలోనూ మార్పులు జరిగాయి. ఈ సినిమా ఫైనల్ రన్ టైమ్ రెండు గంటల 33 నిమిషాలుగా ఉందని తెలుస్తోంది. ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా వచ్చే వారం తెలుగులో కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version