NTV Telugu Site icon

Regina : ఆయనను చూస్తేనే భయమేసేది…

Rejina

Rejina

ఎలాంటి పాత్రలో అయినా తనదైన ట్యాలెంట్‌తో అదరగోడుతుంది టాలీవుడ్ హీరోయిన్ రెజీనా. తెలుగులో యంగ్ హీరోలతో జోడీ కట్టి మెప్పించిన ఈ అమ్మడు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో నటిగా మంచి మార్కులు కొట్టేస్తోంది. బ్యాక్ టూ బ్యాక్ వరుస సినిమాలతో అలరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రెజీనా తాజాగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ‘జాట్‌’ చిత్రం‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సన్నీడియోల్‌ కథానాయకుడిగా టాలీవుడ్‌ డైరెక్టర్‌ మలినేని గోపీచంద్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్‌ 10న విడుదల కానుంది. అయితే ఇటీవల ముంబయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న రెజీనా ఈ చిత్రంలో ఇందులోని తన పాత్ర గురించి, ‘జాట్‌’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.

Also Read:Jatadhara : ‘జటాధర’ షూటింగ్‌పై సోనాక్షి అప్డేట్

‘ ‘జాట్‌’లో నా పాత్ర పేరు భారతి. నా కెరీర్‌లోనే మొదటి సారి ఇలాంటి పాత్రను పోషించాను. తెరపై నన్ను చూసి మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇదొక విభిన్నమైన కథ. ఒక్క రాత్రిలో జరిగే పెను విస్ఫోటనం అని చెప్పవచ్చు. సన్నీడియోల్‌ నట విశ్వరూపం చూస్తారు. లొకేషన్‌లో ఆయన పెర్‌ఫార్మెన్స్‌ చూసి నిజంగా భయమేసింది. ఇక మరి ఆడియన్స్ ఎలా ఫీలవుతారో చూడాలి. దేవుడు దిగి వస్తే.. అన్నట్టుగా ఉంటుంది ఆయన పాత్ర. ఇంతకంటే ఈ సినిమా గురించి చెప్పకూడదు. డైరెక్టర్‌ మలినేని గోపీచంద్‌కి బాలీవుడ్‌లో పెద్ద బ్రేక్‌ ఈ సినిమా. నా కెరీర్ కి కూడా ఈ మూవీ మంచి ప్లెస్ అవుతుందరి కోరుకుంటున్నా. మీకు కచ్చితంగా నచ్చుతుంది’ అని చెప్పింది రెజీనా.