NTV Telugu Site icon

Sunil Shetty: షూటింగ్ లో నటుడికి తీవ్ర గాయాలు

Sunil Shetty

Sunil Shetty

నటుడు సునీల్ శెట్టి గాయపడ్డాడు. తన రాబోయే సిరీస్ హంటర్ సెట్స్‌లో షూటింగ్ సమయంలో విన్యాసాలు చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆయన పక్కటెముకలకు గాయాలయ్యాయి. అయితే ఆయన పరిస్థితి గురించి సునీల్ శెట్టి స్వయంగా వెల్లడించారు. ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని, నేను పూర్తిగా క్షేమంగా ఉన్నానని చెప్పాడు. డూప్ లేకుండా స్వంతంగా స్టంట్‌లు చేస్తాడని పేరున్న శెట్టి హంటర్ కోసం నలుగురైదుగురు స్టంట్ ఆర్టిస్టులతో హై-ఇంటెన్సిటీ ఫైట్ సన్నివేశాన్ని షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదం సంభవించింది. ఈ సన్నివేశంలో ఒక చెక్క లాగ్‌ను సపోర్టుగా ఉపయోగించారు, కానీ తప్పుగా కదలడంతో ఆ లాగ్ అనుకోకుండా నటుడి పక్కటెముకలను తాకింది. ఈ ఘటనలో సునీల్ శెట్టి గాయపడ్డాడు.

Minister Anitha: సోషల్‌ మీడియాలో ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా.. హోంమంత్రి సీరియస్

ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టికి తీవ్ర గాయాలయ్యాయి . ఇండియా టుడే కథనం ప్రకారం, “సునీల్ తీవ్రంగా గాయపడ్డాడు, గాయాన్ని అంచనా వేయడానికి వైద్యులు, ఎక్స్-రే యంత్రాన్ని సెట్‌కు పిలిపించారు. శెట్టి ప్రస్తుతం చాలా నొప్పితో బాధ పడుతున్నారు. ముంబైలో షూటింగ్ ఇప్పుడు ఆగిపోయింది అని పేర్కొన్నారు. అయితే సునీల్ శెట్టి మాత్రం “చిన్న గాయమే అంతకు మించి ఏమీ లేదు, నేను పూర్తిగా బాగున్నా, తదుపరి షాట్‌కి సిద్ధంగా ఉన్నాను. అందరి ప్రేమ, సంరక్షణకు కృతజ్ఞతలు, వెబ్ సిరీస్ సెట్స్‌లో “చిన్న గాయం”తో బాధపడ్డాడు. తీవ్రమైన గాయంతో బాధపడుతున్నట్లు వచ్చిన నివేదికలను తోసిపుచ్చాడు. సునీల్ శెట్టి తదుపరి ‘వెల్‌కమ్ టు ది జంగిల్’లో కనిపించనున్నారు, ఇందులో అక్షయ్ కుమార్, దిశా పటానీ, పరేష్ రావల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, లారా దత్తా, రవీనా టాండన్, అర్షద్ వార్సీ అలాగే శ్రేయాస్ తల్పాడే కూడా కనిపించనున్నారు. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.

Show comments