సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమా ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’. డెన్నీస్ జీవన్ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం సందీప్ కిషన్ కొన్ని రోజుల పాటు ఆ ఆటను ప్రాక్టీస్ చేశాడు. విశేషం ఏమంటే ఇందులో లావణ్య త్రిపాఠి సైతం హాకీ ప్లేయరే! అయితే… ఎన్నో అంచనాలతో మార్చి 5న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇప్పుడీ సినిమాను మే 1 నుండి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సందీప్ కిషన్ అభిమానులు, క్రీడానేపథ్య చిత్రాలను ఇష్టపడే వారు ఈ మూవీని ఎంచక్కా చూసేయొచ్చు.