ఈ ఏడాది సీనియర్ మోస్ట్ తమిళ దర్శకులు మణిరత్నం, శంకర్, ఏఆర్ మురుగుదాస్ నుండి యంగ్ ఫిల్మ్ మేకర్లు లోకేశ్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యారు. కానీ ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన సి సుందర్ మదగజరాజా సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. దాంతో రజనీకాంత్ తో సినిమా చేసే గోల్డెన్ అఫర్ పట్టేసాడు సుందర్ సి. ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తుండడం విశేషం.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
ఒక్క దెబ్బకు అటు రజనీ, ఇటు కమల్‌తో వర్క్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టేశాడు సుందర్ సి. అరుణాచలం తర్వాత మళ్లీ 28 ఏళ్లకు తలైవాతో సుందర్ వర్క్ చేస్తుండటంతో ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి. కోలీవుడ్‍కు ధౌజండ్ క్రోర్ అందిస్తాడేమో అనుకునేలోపు ప్రాజెక్ట్ నుండి క్విటయ్యాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల తలైవర్ 173 నుండి తప్పుకుంటున్నానని ఎనౌన్స్ చేసిన సి సుందర్… రజనీకాంత్, కమల్ హాసన్‌తో రిలేషన్ అలాగే ఉంటుందని స్టేట్ మెంట్ పాస్ చేశాడు. కాని చెన్నై వర్గాల సమాచారం ప్రకారం సుందర్ సి చెప్పిన లైన్ రజనీకి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. కానీ ఇటీవల ఫుల్ నరేషన్ ఇచ్చినపుడు కథలో కొన్ని మార్పులు చేర్పులు చెప్పారట సూపర్ స్టార్. అప్పటికి రెండు, మూడు వర్షన్స్ ను రెడీ చేసి నరేషన్ ఇచ్చాడట సుందర్ సి. కానీ అవేవి రజనీకి అంతగా నచ్చలేదట. అక్కడే ఇద్దరి మధ్య కాస్త విభేదాలు తలెత్తాయట. ఇక కలిసి సినిమా చేయడం కరెక్ట్ కాదని రజనీ, కమల్ కు ఈ సినిమా చేయలేనని సున్నితంగా చెప్పి ప్రాజెక్ట్ నుండి బయటకు వచేసాడట సుందర్ సి. మరి ఇప్పుడు కమల్ బ్యానర్ లో సినిమా ను ఎవరు డైరెక్ట్ చేస్తారో అన్న క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో నెలకొంది.
