Site icon NTV Telugu

Sumaya Reddy: ‘డియర్ ఉమ’ విజయాన్ని మహిళలందరికీ అంకితం చేస్తున్నా!

Dear Uma Sucess Meet

Dear Uma Sucess Meet

సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై సుమయ రెడ్డి రచయితగా, నిర్మాతగా, హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘డియర్ ఉమ’. సాయి రాజేష్ మహదేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రధన్ సంగీతాన్ని అందించగా, రాజ్ తోట సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఏప్రిల్ 18, 2025న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి అమోఘమైన ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో, చిత్ర బృందం శనివారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.

Indragnti Mohana Krishna: నమ్మకాలు మూఢనమ్మకాలుగా మారితే.. “సారంగపాణి జాతకం”: ఇంద్రగంటి

సుమయ రెడ్డి మాట్లాడుతూ, “‘డియర్ ఉమ’కు మీడియా అద్భుతమైన మద్దతు ఇచ్చింది. సినిమాకు వస్తున్న స్పందన చూసి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎన్నో సినిమాలు విడుదల కాకుండా ఆగిపోతున్నాయి, కానీ మేము సక్సెస్‌ఫుల్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశాం—ఇదే నాకు గొప్ప విజయం. ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాష్ట్రంలోని మహిళలందరికీ అంకితం చేస్తున్నాను. నా తల్లి, సోదరుడు, మా టీమ్ సహకారంతోనే ఈ స్థాయికి చేరాను. రధన్ గారి సంగీతం అందరినీ ఆకర్షించింది. మన జీవితం ఆసుపత్రిలో మొదలై, అక్కడే ముగుస్తుంది. అలాంటి సునిశితమైన అంశంతో తెరకెక్కిన ‘డియర్ ఉమ’ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ సహకారం కావాలి. మా చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు,” అని తెలిపారు.

Exit mobile version