అదేంటి సుకుమార్ లాంటి డైరెక్టర్ ఒక మహిళా దర్శక నిర్మాతను లైవ్ లోనే కొట్టడం ఏమిటి అని అనుమానం మీకు కలగవచ్చు. అయితే అది సీరియస్గా కాదండోయ్ సరదాగా. అసలు విషయం ఏమిటంటే సుకుమార్ కుమార్తె సుకృతి ప్రధాన పాత్రలో గాంధీ తాత చెట్టు అనే సినిమా రూపొందించారు. ఈ సినిమా జనవరి 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో రచ్చబండ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమా దర్శకురాలు పద్మావతి మల్లాది మాట్లాడుతుండగా ఈ సినిమా అసలు ఎలా పట్టాలెక్కింది అనే విషయం చెబుతూ నిర్మాత శేష సింధు రావు గురించి కామెంట్స్ చేశారు. శేష సింధు రావు గతంలో కొన్ని సినిమాలకు రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించారు. చూసి చూడంగానే అనే సినిమాతో దర్శకురాలిగా మారారు.
Thabitha sukumar: స్టేజ్ మీదే ఏడ్చేసిన సుకుమార్ భార్య
అయితే ఈ గాంధీ తాత చెట్టు కథ వినగానే ఇంత మంచి కథలో తాను కూడా భాగం అవ్వాలని భావించి డబ్బులు లేకపోయినా నిర్మాతగా వ్యవహరిస్తానని ముందుకు వచ్చిందట. అంతా సిద్ధమైన తర్వాత చేతిలో ఎంత ఉన్నాయని అడిగితే ఐదారు వేలు ఉంటాయని చెప్పిందట. ఈ విషయం పద్మావతి మల్లాది చెబుతున్న సమయంలో సరదాగా సుకుమార్ లేచి వెళ్లి అక్కడే ఉన్న శేష సింధూరావుని చేతితో తట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాని ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ భుజానికి ఎత్తుకుంది. జనవరి 24వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాని పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పచ్చదనం గురించి చేసిన ఈ సినిమా ఇప్పటికే జాతీయంగా, అంతర్జాతీయంగా పలు ఫిలిం ఫెస్టివల్ అవార్డులను సంపాదించడం గమనార్హం..