NTV Telugu Site icon

Gorre Puranam: సుహాస్ ‘గొర్రె పురాణం’.. ఇంత జరిగిందా?

Suhas Gorrepuranam

Suhas Gorrepuranam

Suhas Obstacles for Gorre Puranam: యంగ్ హీరో సుహాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. నిజానికి సుహాస్ సినిమాలలు మినిమం గ్యారెంటీ సినిమాలుగా థియేటర్లలో కూడా ఆడుతున్నాయి. ఇప్పటికే ఆయన గొర్రె పురాణం అనే సినిమా చేశాడు. ఇది ఒక ఆసక్తికరమైన ప్రయత్నం అనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ఈరోజు రిలీజ్ కావాల్సి ఉంది కానీ అనూహ్యంగా రేపటికి వాయిదా పడింది. అయితే ఈ సినిమా ఇలా వాయిదా పడడానికి అసలు కారణం సుహాస్ అని తెలుస్తోంది. నటుడు సుహాస్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు కానీ అతను ఈ సినిమా ప్రమోషన్‌కు దూరంగా ఉన్నాడు. మేకర్స్ అతనిని కోరినప్పటికీ, సుహాస్ గొర్రె పురాణం ట్రైలర్ లాంచ్‌కు హాజరు కాలేదు. సుహాస్ ఈ చిత్రానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో చిత్రబృందం ప్రమోషనల్ ప్లాన్‌లను కూడా రద్దు చేసింది.

Prabhas Movies: ఒకేసారి మూడు సినిమాలు.. దటీజ్ ‘ప్రభాస్’?

ఇది కాకుండా, సుహాస్ తన రాబోయే చిత్రం జనక అయితే గనక అక్టోబర్‌లో విడుదలవుతున్నందున ఈ సినిమా విడుదలను నవంబర్‌కు వాయిదా వేయాలని గొర్రె పురాణం బృందాన్ని ప్రెజర్ చేస్తున్నాడని అంటున్నారు. గొర్రె పురాణం రిజల్ట్ సంగతి పక్కన పెడితే అసలు ఇప్పటివరకు సుహాస్ సినిమాకి సపోర్ట్ చేసిందే లేదని అంటున్నారు. సుహాస్ వచ్చింది కూడా యూట్యూబ్ బ్యాగ్రౌండ్ నుంచే చిన్న సినిమాలుకు సపోర్ట్ చేయకుండా తాను చేస్తున్న మరో సినిమా కోసం ఈ సినిమాని వాయిదా వేయమని కోరడం కరెక్ట్ కాదు అనే వాదన వినిపిస్తోంది. గొర్రె పురాణం డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడుకున్నదని ట్రైలర్ తో కొత్త క్లారిటీ ఉంది. అయితే ఎలాంటి ఆప్షన్స్ లేకపోవడంతో గొర్రె పురాణం మేకర్స్ ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇది సుహాస్‌కు ఇప్పుడు ఏమీ ఎఫెక్ట్ చూపకపోయినా భవిష్యత్తులో కచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం ఈ గొర్రె పురాణం సెప్టెంబర్ 21న విడుదల కానుంది. బాబీ దర్శకుడుగా ఫోకల్ వెంచర్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మించారు.

Show comments