Gorre Puranam: సుహాస్ ‘గొర్రె పురాణం’.. ఇంత జరిగిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suhas Obstacles for Gorre Puranam: యంగ్ హీరో సుహాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. నిజానికి సుహాస్ సినిమాలలు మినిమం గ్యారెంటీ సినిమాలుగా థియేటర్లలో కూడా ఆడుతున్నాయి. ఇప్పటికే ఆయన గొర్రె పురాణం అనే సినిమా చేశాడు. ఇది ఒక ఆసక్తికరమైన ప్రయత్నం అనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ఈరోజు రిలీజ్ కావాల్సి ఉంది కానీ అనూహ్యంగా రేపటికి వాయిదా పడింది. అయితే ఈ సినిమా ఇలా వాయిదా పడడానికి అసలు కారణం సుహాస్ అని తెలుస్తోంది. నటుడు సుహాస్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు కానీ అతను ఈ సినిమా ప్రమోషన్‌కు దూరంగా ఉన్నాడు. మేకర్స్ అతనిని కోరినప్పటికీ, సుహాస్ గొర్రె పురాణం ట్రైలర్ లాంచ్‌కు హాజరు కాలేదు. సుహాస్ ఈ చిత్రానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో చిత్రబృందం ప్రమోషనల్ ప్లాన్‌లను కూడా రద్దు చేసింది.
Prabhas Movies: ఒకేసారి మూడు సినిమాలు.. దటీజ్ ‘ప్రభాస్’?
Also Read
- Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
- Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
- Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
- Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
ఇది కాకుండా, సుహాస్ తన రాబోయే చిత్రం జనక అయితే గనక అక్టోబర్‌లో విడుదలవుతున్నందున ఈ సినిమా విడుదలను నవంబర్‌కు వాయిదా వేయాలని గొర్రె పురాణం బృందాన్ని ప్రెజర్ చేస్తున్నాడని అంటున్నారు. గొర్రె పురాణం రిజల్ట్ సంగతి పక్కన పెడితే అసలు ఇప్పటివరకు సుహాస్ సినిమాకి సపోర్ట్ చేసిందే లేదని అంటున్నారు. సుహాస్ వచ్చింది కూడా యూట్యూబ్ బ్యాగ్రౌండ్ నుంచే చిన్న సినిమాలుకు సపోర్ట్ చేయకుండా తాను చేస్తున్న మరో సినిమా కోసం ఈ సినిమాని వాయిదా వేయమని కోరడం కరెక్ట్ కాదు అనే వాదన వినిపిస్తోంది. గొర్రె పురాణం డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడుకున్నదని ట్రైలర్ తో కొత్త క్లారిటీ ఉంది. అయితే ఎలాంటి ఆప్షన్స్ లేకపోవడంతో గొర్రె పురాణం మేకర్స్ ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇది సుహాస్‌కు ఇప్పుడు ఏమీ ఎఫెక్ట్ చూపకపోయినా భవిష్యత్తులో కచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం ఈ గొర్రె పురాణం సెప్టెంబర్ 21న విడుదల కానుంది. బాబీ దర్శకుడుగా ఫోకల్ వెంచర్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మించారు.
తాజావార్తలు
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
-
Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
-
PM Kisan 24th Installment: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్‌లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
-
Kerala: ‘‘మహిళలు పబ్లిక్‌లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!