Prabhas Movies: ఒకేసారి మూడు సినిమాలు.. దటీజ్ ‘ప్రభాస్’?
- స్పీడ్ పెంచిన రెబల్ స్టార్
- ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్న ప్రభాస్
- ముందుగా రాజాసాబ్ పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘రెబల్ స్టార్’ ప్రభాస్ స్పీడ్‌ను మరే హీరో కూడా అందుకోవడం కష్టమనే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4-5 పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలు లైన్లో పెట్టిన డార్లింగ్.. ఒకేసారి మూడు సినిమాల షూటింట్‌లలో పాల్గొంటుండడం విశేషం. ప్రభాస్ కమిట్ అయిన సినిమాల్లో ‘సలార్ 2’ షూటింగ్‌కు కాస్త టైం పట్టేలా ఉంది కానీ.. మిగతా సినిమాలు మాత్రం ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’ సెట్‌లో ఉన్నారు. ముందుగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి.. హను రాఘవపూడి ప్రాజెక్ట్‌లో జాయిన్ అవనున్నారు. అందుకే వీలైనంత త్వరగా మారుతిని రాజాసాబ్ పూర్తి చేయాలని చెప్పాడట.
Also Read: Jani Master: జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్.. చర్లపల్లి జైలుకు తరలింపు!
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
అయితే రాజాసాబ్ అవకముందే హను రాఘవపూడి మూవీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. తమిళనాడు మధురైలో ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ లేని సన్నివేశాలను హను చిత్రీకరిస్తున్నారు. ఓ వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగుతుందని సమాచారం. ప్రభాస్ రాజాసాబ్ చిత్ర షూటింగ్ ముగించుకుని ‘ఫౌజీ’లో జాయిన్ అవనున్నారు. ఈ సినిమా 1945 నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇక మరోవైపు కల్కి 2కి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ అయింది. మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్‌తో పాటు గ్రాఫిక్స్ వర్క్‌ని పూర్తి చేయాల్సి ఉంది. త్వరలోనే ప్రభాస్ కల్కి2 ని కూడా పూర్తి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈలోపు నాగ్ అశ్విన్ మిగతా వర్క్ కంప్లీట్ చేసుకోనున్నాడు. ఏదేమైనా ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్నవారు లేరు. ఇది కేవలం ప్రభాస్‌కి మాత్రమే సాధ్యమైందని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..