సుహాస్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘జనక అయితే గనక’. దసరా కానుకగా ‘జనక అయితే గనక’ టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.ఈ విజయదశమి రోజు అనగా ఈ నెల 12న విడుదల కానుంది జనక అయితే గనక. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘మంచి సినిమా తీశాం అని మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాం. ఆ నమ్మకంతోనే ఇప్పటికే నాలుగు ప్రీమియర్ షోలు వేశాం. చూసిన వాళ్లందరి నుంచి చాలా మంచి స్పందన లభించింది. ఫుల్ అండ్ ఫన్ తో అందరికి నవ్వించి, అందర్నీ అలరించేలా ఉంటుంది’’ అని అన్నారు.
Also Read : Dasara : విజయదశమి బరిలో పోటీ పడనున్న సినిమాలు ఇవే..
చిత్ర హీరో నటుడు సుహాస్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం యూఎస్‌లో తెలుగు రాష్టాల కంటే ముందుగా అక్టోబరు 10న విడుదలవుతుంది. మన దగ్గర దసరా నాడు అనగా 12న వస్తుంది. ఈ సినిమాను తప్పకుండా థియేటర్స్‌లో చూడండి. ఇది కచ్చితంగా ఎవరినీ నిరుత్సాహపరచదు అందుకు నాది గ్యారెంటీ. ఇప్పటి వరకు సినిమా చూసిన దర్శకులంతా బాగుందని మెచ్చుకుంటున్నారు. నా గత చిత్రాలకంటే ఇంకా బాగా వచ్చిందని ప్రశంసిస్తున్నారు, ఆ నమ్మకంతోనే చిత్రాన్నియూఎస్‌లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అని అన్నారు. మరో నిర్మాత హర్షిత్ రెడ్డి. మాట్లాడుతూ ‘భార్యాభర్త, అమ్మ, అమ్మమ్మ. ఇలా అందరి కోణంలో సాగే కథనేపథ్యంలో సాగే చిత్రమిది. తప్పకుండా అన్ని వయసుల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’ పండుగ రోజు ఒక మంచి సినిమా చుసిన ఫీలింగ్ కలుగుతుంది’ అని అన్నారు