NTV Telugu Site icon

Nagendra Babu: మహేష్ బాబు గుణం అలాంటిది: నాగేంద్రబాబు

February 7 2025 02 25t085955.048

February 7 2025 02 25t085955.048

చిరంజీవి తమ్ముడు అయినప్పటికీ… తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన నటనతో మంచి గుర్తింపును దక్కించుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు. టాలీవుడ్ లో మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు . అలాగే నిర్మాతగానూ పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. కానీ అనుకున్నంతగా లాభాలు అందుకోలేకపోయాడు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి ఆయన పాలిటిక్స్ లో బిజీ బిజీగా ఉంటున్నారు.జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు నాగ బాబు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు..

Also Read: Chiranjeevi: అనిల్‌ రావిపూడి తో మూవీపై లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చిన చిరంజీవి..

నాగబాబు మాట్లాడుతూ.. ‘ నా తమ్ముడు పవన్ కళ్యాణ్ కి సమానంగా ఇండస్ట్రీలో హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది మహేష్ బాబు మాత్రమే. ముఖ్యంగా మహేష్ బాబుకి ఉన్నంత లేడీ ఫాలోయింగ్ ఏ హీరోకి లేదు. చెప్పాలంటే అందంలో ఆయనకు పోటీ ఇచ్చే మగాడు కూడా లేరు. మా భార్య కూడా మహేష్ బాబు కి పెద్ద ఫ్యాన్. తన తమ్ముడి గా భావిస్తూ ఉంటుంది. చిన్నతనంలో మహేష్ బాబు బాగా లావుగా ఉండేవాడు సన్నగా, నాజుగ్గా మారేందుకు అతను ఎంతో కష్ట పడేవాడో నాకు తెలుసు. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ లో నాన్ స్టాప్ గా పరుగులు తీసే వాడు. ఏదైనా అనుకుంటే సాధించి తీరే వరకు నిద్రపోని గుణం మహేష్ లో ఉంది. ఆ గుణం నాకు నచ్చుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.