Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి కోసం బడా స్టార్స్ వెయిటింగ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో నెంబర్ వన్ దర్శకుడిగా రాజమౌళి దూసుకుపోతున్నాడు. తనతో సినిమా అంటే స్టార్స్ అయిన బల్క్ డేట్స్ ఇచ్చేస్తున్నారు. అంతగా దర్శకధీరుడి పై నమ్మకం ఏర్పడింది. అయితే జక్కన్న రేంజ్ లోనే మరో దర్శకుడి పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.తనతో ఒక్క సినిమా అయిన చేయాలని బడా స్టార్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆయన ఎవరో కాదు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డితో దర్శకుడిగా మారిన సందీప్ రెడ్డి వంగా కబీర్ సింగ్ తో హిట్ కొట్టాడు. యానిమల్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. సందీప్ కథని చెప్పే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. అతను డిజైన్ చేసే హీరో పాత్రలు హై ఓల్టేజ్ పుట్టిస్తాయి. కంటెంట్ ని గ్రాఫిక్స్ తో కాకుండా బలమైన క్యారెక్టరైజేషన్ తో ఎలివేట్ చేస్తాడు. ఇది ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అందుకే సందీప్ తో సినిమా చేయడానికి స్టార్స్ అంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
Drishyam Style Murder: “దృశ్యం” తరహాలో ప్రియురాలిని హత్య చేసిన ఆర్మీ జవాన్..
Also Read
సందీప్ రెడ్డి వంగా ప్రజెంట్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేస్తున్నాడు. అల్లు అర్జున్ ప్రాజెక్ట్ కూడా కన్ఫార్మ్ అయింది. జక్కన్న తర్వాత మహేష్ సినిమా సందీప్ డైరెక్షన్ లోనే ఉంటుందట. ఎన్టీఆర్ కూడా రీసెంట్ గా సందీప్ తో చర్చలు జరిపాడు. రామ్ చరణ్ కూడా ఈ డైరెక్టర్ తో సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నాడు. బాలీవుడ్ లో యానిమల్ పార్క్ పెండింగ్ లో ఉంది. సినిమా చేస్తానంటే డేట్స్ ఇచ్చేందుకు బాలీవుడ్ ,కోలీవుడ్ హీరోలు సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి రాజమౌళితో సినిమాలు చేసిన స్టార్స్ అంతా సందీప్ డైరెక్షన్ లో మూవీస్ చేయడానికి క్యూ కడుతున్నారు. దీనిని బట్టి ఈ డైరెక్టర్ ఆడియన్స్ కి, స్టార్ హీరోలకి ఎంతగా కనెక్ట్ అయ్యాడో అర్ధం చేసుకోవచ్చు. అయితే ప్రజెంట్ సందీప్ ఒక్కో సినిమాకి ఏడాదికి పైగా టైం తీసుకుంటున్నాడు. ప్రభాస్ స్పిరిట్ తర్వాత, రణబీర్ తో యానిమల్ పార్క్ ఉంటుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ మూవీ ఉండొచ్చు. ఈ మూడు అయ్యాక మహేష్,ఎన్టీఆర్,రామ్ చరణ్ తో సినిమాలు చేసే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!