Site icon NTV Telugu

ilaiyaraaja : ఇళయరాజా కారణంగా నెట్ ఫ్లిక్స్ నుండి స్టార్ హీరో సినిమా డిలీట్

Goodbadugly

Goodbadugly

తెలుగులో అగ్రగామి సంస్థగా సినిమాలు రూపొందిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో తమిళ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా యంగ్ డైరెక్టర్ ఆదిక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పై GBU సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని రికార్డ్ స్థాయి కలెక్షన్స్  రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Also Read : OTT : రికార్డ్ వ్యూస్ తో ప్రైమ్ లో సెన్సేషన్ సృష్టిస్తున్న మలయాళ థ్రిల్లర్

అయితే ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో ఒకప్పటి తమిళ్ సినిమాలలోని ఇళయరాజా సంగీతం అందించిన సాంగ్స్ ను గుడ్ బ్యాడ్ అగ్లీలో వారిని రీమిక్స్ చేసి ఉపయోగించారు. ఆ సదరు సీన్స్ థియేటర్స్ లో ఫ్యాన్స్ ఆ సాంగ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు సంబందించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే తన పాటను అనధికారికంగా వాడుకోవటం పై ఇళయరాజా ఆగ్రహం వ్యక్తం చేసారు. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కు ఇళయరాజా నోటీసులు పంపారు.  నష్టపరిహారం కింద తనకు ఐదు కోట్ల రూపాయలు చెల్లించాలంటూ నోటీసులో పెరికొన్నారు ఇళయరాజా. ఈ వివాదం గత కొంత కాలంగా నడుస్తోంది. చెన్నై కోర్టులోనూ ఇళయరాజాకు అనుకూలంగా తీర్పు రావడంతో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా నుండి ఇళయరాజా సాంగ్స్ ను తొలగించారు. అలాగే  ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ గుడ్ బ్యాడ్ అగ్లీ డిజిటల్ హక్కులు కొనుగోలు చేసి  స్ట్రీమింగ్ చేస్తుండగా ఇప్పుడు ఇళయరాజా వివాదం కారణంగా నేట్ ఫ్లిక్స్ నుండి GBUను డిలీట్ చేసింది.

Exit mobile version