Site icon NTV Telugu

Bollywood : కొడుకుని హీరోగా నిలబెట్టేందుకు స్టార్ హీరో ఆపసోపాలు

Ayan Shetty

Ayan Shetty

బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో సునీల్ శెట్టి ప్రజెంట్ ఫామ్ కోల్పోయాడు. కూతుర్ని హీరోయిన్ చేద్దామనుకుంటే పెద్దగా వర్కౌట్ కాలేదు. పట్టుమని ఐదు సినిమాలు కూడా చేయకుండా సినిమాలకు టాటా చెప్పేసి క్రికెటర్ కెఎల్ రాహుల్‌తో ఏడడుగులు వేసి ప్రజెంట్ మదర్ హుడ్ ఎంజాయ్ చేస్తోంది. ఇప్పుడు అతడి హోప్స్ అన్నీ సన్ అహన్ శెట్టిపైనే. ఇప్పటికే కొడుకుని ఆర్ఎక్స్ 100 రీమేక్ వర్షన్ తడప్‌తో హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన సునీల్ ఇక స్టార్ డమ్ తెచ్చేపనిలో పడ్డాడు.

Also Read : Pati Patni Aur Woh : శ్రీలీల బాలీవుడ్ అఫర్ ను లాగేసుకున్న నేపో డాటర్

ఫస్ట్ మూవీతో ఓకే అనిపించుకున్న అహన్ శెట్టి కోసం నెక్ట్స్ ప్రాజెక్టుల కోసం ప్రిపేర్ చేస్తున్నాడు సునీల్. 1997లో హిట్టు బొమ్మగా నిలిచిన బోర్డర్ సీక్వెల్ కొడుకు కోసం సెట్ చేశాడు. ప్రజెంట్ అహన్ నటిస్తున్న బోర్డర్ 2 సెట్స్ పై ఉంది. ఈ లోగా కొడుకు కోసం మరో సౌత్ సినిమాను రీమేక్ చేసేందుకు వెతుకులాట స్టార్ట్ చేసి 2016లో కన్నడ హిట్ మూవీగా నిలిచిన కిరాక్ పార్టీని రీమేక్ చేయాలని యోచనలో ఉన్నాడట. కన్నడలో రక్షిత్ శెట్టి, రష్మిక చేయగా తెలుగులో నిఖిల్ ఇదే టైటిల్‌తో హిట్టు కొట్టాడు. ఇప్పుడు ఇదే సినిమాను తన కొడుకుతో రీమేక్ చేయాలనే ప్లాన్ చేస్తున్నాడు సునీల్ శెట్టి. అయితే రీసెంట్లీ తమిళ్, తెలుగులో హిట్టుగా నిలిచిన లవ్ టుడేను అమిర్ ఖాన్ కొడుకు లవ్యాపాగా రీమేక్ చేస్తే ప్లాప్ గా నిలిచింది. మరి ఇప్పుడు సునీల్ శెట్టి కొడుకు కిరాక్ పార్టీ రీమేక్ చేస్తే ఎటువంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

Exit mobile version