Site icon NTV Telugu

Kollywood : ప్రెజర్ తట్టుకోలేక ప్రొడక్షన్ హౌస్ ను మూసేస్తున్నట్టు ప్రకటించిన స్టార్ డైరెక్టర్

Vetri Maran

Vetri Maran

నిర్మాణ సంస్థ అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు. కోట్ల రూపాయల పెట్టుబడి కావాలి. సరైన కథలు ఎంపిక చేసుకోవాలి. సరైన స్టార్ కాస్టింగ్ వంటివి చూసుకోవాలి. అనుకున్న బడ్జెట్ లో సినిమాలు ఫినిష్ చేయాలి, లేదంటే వడ్డీలు అదనం. ఒక్కోసారి సినిమా ప్లాప్ అయితే కోట్ల రూపాయల డబ్బు వెనక్కి ఇవ్వాలి. ఇలా ఒకటి కాదు రెండు అనేక విషయాలు ప్రొడక్షన్ ముడిపడి ఉంటాయి. స్టార్ హీరోలు ముందు తమ వారిని ఉంచి పెట్టుబడులు పెడుతుంటరు. కొందరు డైరెక్ట్ గానే పెట్టుబడులు పెడుతుంటారు.  ఇటీవల కాలంలో స్టార్ హీరోలు, దర్శకులు కూడా నిర్మాణ సంస్థలు స్థాపించి సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

Also Read :September 5th Clash : సెప్టెంబర్ 5న పాన్ ఇండియా సినిమాల బిగ్గెస్ట్ క్లాష్.. గెలుపెవరిదో?

అలాగే నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన ఓ స్టార్ డైరెక్టర్ ఇప్పడు ఆ ప్రెజర్ తట్టుకోలేక తన సంస్థను మూసేస్తున్నట్టు ప్రకటించాడు. అతడెవరో కాదు తమిళ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన వెట్రిమారన్. దర్శకుడిగా సూపర్ హిట్ సినిమాలు అందించిన వెట్రిమారన్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. గ్రాస్ రూట్ ఫిలిం కంపెనీ పేరుతో సిద్దార్ధ్ హీరోగా NH-4 అనే సినిమాతో నిర్మాతగా మారి పలు సినిమాలు నిర్మించారు. ఇటీవల బ్యాడ్ గర్ల్ అనే సినిమాను నిర్మించారు వెట్రి. ఈ  సినిమా ఈ నెల 5న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంబంధించి జరిగిన ఈవెంట్ లో వెట్రి మాట్లాడుతూ.. తన నిర్మాణ సంస్థ GrassRootFilmCompany ని మూసివేయనున్నను. డైరెక్టర్ గా ఉండటం తనకు స్వేచ్ఛనిస్తుందని, కానీ నిర్మాతగా ఉండటం తనపై చాలా ఒత్తిడిని పెంచుతుంది,  ఆ ఒత్తిడిని హ్యాండిల్ చేయలేను,   నిర్మాతగా  బ్యాడ్ గర్ల్  నా చివరి చిత్రం’ అని తెలిపారు.

 

Exit mobile version