NTV Telugu Site icon

SSRMB: లోకేషన్స్ వేటలో రాజమౌళి.. వీడియో వైరల్…

Ssrmb (2)

Ssrmb (2)

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రానుంది. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో జేమ్స్ బాండ్ తరహాలో  రానుందని,టైటిల్ ఇదే అని అలా ఒకేటేమిటి రకరకాల ఊహాగానాలు రోజుకొకటి వినిపించాయి.

Also Read : NTRNeel : ఎన్టీఆర్ – నీల్ షూటింగ్ సినిమా స్టార్ట్..

తాజాగా SSRMB సినిమాకు సంబంధించి లొకేషన్స్ వేటలో  దర్శక ధీరుడు రాజమౌళి బిజీగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ  సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తాజగా నేడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాకు సంబంధించి రాజమౌళి కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్కును సందర్శించారు. ఆ ఫోటోలను, విడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు రాజమౌళి. ఆ వీడియోలు,ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కాగా మహేష్ బాబుతో చేస్తున్న సినిమాను భారతీయ సినిమాలో అతిపెద్ద యాక్షన్-అడ్వెంచర్ సినిమాగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. SSRMB సినిమాతో వరల్డ్ సినిమా లో ఇండియన్ సినిమా గుర్తును మరింత బలంగా వేయబోతున్నాడు దర్శక ధీరుడు. మరోవైపు ఈ సినిమాలో యూనిట్ సబ్యులకు వర్క్ షాప్ నిర్వహిస్తున్నాడు జక్కన్న. వర్క్ షాప్ పూర్తయిన వెంటనే రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది జనవరి లో ఫారిన్ లో  మొదలెట్టనున్నారు.

Show comments