Site icon NTV Telugu

SSMB 29 : మహేష్ ఫ్యాన్స్ అలర్ట్.. ఆఫ్రికాకు జక్కన్న అండ్ టీం!

Ssmb29

Ssmb29

మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాపై ఆసక్తికరమైన అప్‌డేట్స్ వచ్చాయి. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి స్వయంగా ఈ సినిమా గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. కేవలం కొన్ని ప్రెస్ మీట్‌లు లేదా అప్‌డేట్స్ ద్వారా సినిమా కథాంశాన్ని పూర్తిగా వివరించలేమని రాజమౌళి స్పష్టం చేశారు. సినిమా గురించి అప్పటికప్పుడు ఏది అప్‌డేట్ ఇవ్వాలో అదే ఇస్తామని తెలిపారు. దక్షిణాఫ్రికాలో ఇటీవల జరిగిన అల్లర్ల కారణంగా అక్కడ ప్లాన్ చేసిన షూటింగ్ వాయిదా పడింది. సెప్టెంబర్ రెండో వారంలో సౌత్ ఆఫ్రికాలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Also Read:Mass Jathara : మాస్ జాతర రెడీ.. కానీ రిలీజ్ అవుద్దా?

సౌత్ ఆఫ్రికా షెడ్యూల్ ఆలస్యం కావడంతో, ఈ మధ్య హైదరాబాద్‌లోనే హీరోయిన్‌తో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేశారు. ప్రస్తుతం షూటింగ్స్ నిలిచిపోయిన నేపధ్యంలో సౌత్ ఆఫ్రికా షెడ్యూల్ కోసం బిజీగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మునిగి పోయారు రాజమౌళి. ఈ క్రమంలో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మీద మహేష్ ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, రాజమౌళి స్థాయికి తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో తెరకెక్కుతుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు పృథ్వీ రాజ్ సుకుమారన్ తో పాటు ప్రియాంక చోప్రా కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Exit mobile version