Site icon NTV Telugu

SSMB29 : మహేష్‌ బాబు – రాజమౌళి మూవీ లాంచ్‌కి ఆల్‌ స్టార్‌ సెలబ్రేషన్‌ ప్లాన్‌?

Ssmb29

Ssmb29

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, పాన్‌ ఇండియా దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం SSMB29 పై రోజు రోజుకూ హైప్‌ పెరుగుతోంది. ఇండియన్‌ సినీ ఇండస్ట్రీ మొత్తానికి ఇది కేవలం ఒక సినిమా కాదు, గ్లోబల్‌ లెవెల్‌లో దృష్టి సారించిన ప్రాజెక్ట్‌గా మారిపోయింది. ఈ సినిమాపై మొదటి నుంచీ అభిమానులకే కాదు, సినీ ప్రేమికులందరికీ భారీ అంచనాలున్నాయి. ఇక తాజాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన సెన్సేషనల్ అప్ డేట్ బయటకు వచ్చింది.

Also Read : Adivi Sesh: ప్రేక్షకులే విజేతను నిర్ణయిస్తారు – అడివి శేష్‌ ఫైర్‌ కామెంట్స్‌

ఈ చిత్రానికి సంబంధించిన ఓ అనౌన్స్మెంట్‌ వీడియో రిలీజ్‌ కాగా, అందులో టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్‌ అందరినీ వరుసగా చూపించడం సోషల్‌ మీడియాలో కలకలం రేపింది. ఆ వీడియోలో ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, అల్లూ అర్జున్‌, ప‌వ‌న్‌ కళ్యాణ్‌ వంటి స్టార్‌ హీరోలు కనబడటంతో అందరి ఫ్యాన్స్‌ ఒక్కసారిగా ఉత్సాహంతో ఊగిపోయారు. ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక్క మాటే వినిపిస్తోంది..  “SSMB29 లాంచ్‌కి ఆల్‌ స్టార్‌ సెలబ్రేషన్‌ జరుగుతుందా?” అని.

అయితే వార్తల ప్రకారం, రాజమౌళి, మహేష్‌ బాబు జట్టు ఈ ప్రాజెక్ట్‌ లాంచ్‌ని ఆల్‌టైమ్‌ గ్రాండ్‌ ఈవెంట్‌గా మార్చాలని భావిస్తున్నారట. ఇందుకోసం టాలీవుడ్‌ నుంచి మాత్రమే కాదు, బాలీవుడ్‌, కోలీవుడ్‌ నుంచి కూడా స్టార్‌ గెస్టులను ఆహ్వానించే ప్రణాళికలో ఉన్నారని సమాచారం. ఒకవేళ ఈ ఈవెంట్‌లో నిజంగా టాప్‌ హీరోలు, దర్శకులు, నిర్మాతలు అందరూ ఒకే వేదికపై కనబడితే అది ఇండియన్‌ సినిమా చరిత్రలోనే అతిపెద్ద లాంచ్‌ ఈవెంట్‌గా నిలిచిపోతుందని చెప్పవచ్చు. మరి ఈ బజ్‌లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Exit mobile version